ఎంత కేర్ తీసుకున్న జుట్టు హెవీగా రాలిపోతుందా.. అయితే ఈ ఆయిల్ వాడండి..!
TeluguStop.com
సాధారణంగా కొందరికి హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది చాలా హెవీ గా ఉంటుంది.
ఎంత కేర్ తీసుకున్నప్పటికీ జుట్టు రాలడం అనేది తగ్గదు.మీరు కూడా ఈ ప్రాబ్లం ను ఫేస్ చేస్తున్నారా.
? జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కావడం లేదా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.
ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ఎలాంటి హెయిర్ ఫాల్ కు అయినా సమర్థవంతంగా చెక్ పెడుతుంది.
జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.మరి ఇంతకీ ఆ ఆయిల్ ఏంటి.
? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు ఆవ నూనెను ( Mustard Oil )పోసుకోవాలి.
ఆయిల్ కొంచెం వేడి అయ్యాక అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, నాలుగు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ), రెండు మందారం ఆకులు మరియు వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax Seeds ) వేసి చిన్న మంటపై దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.
"""/" /
పూర్తిగా కూల్ అయ్యాక ఒక బాటిల్ లో ఆయిల్ ను స్టోర్ చేసుకోవాలి.
ఇక ఈ ఆయిల్ ను వారానికి కనీసం రెండుసార్లు ఉపయోగించండి.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఆయిల్ పట్టించి మసాజ్ చేసుకోండి.
ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల అనంతరం లేదా మరుసటి రోజు తేలిక పాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయండి.
"""/" /
ఈ ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకున్నారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.
జుట్టు కుదుళ్లను బలపరచడంలో మరియు జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలో ఈ ఆయిల్ సూపర్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల కొత్త జుట్టు ఎదుగుదల ప్రారంభమవుతుంది.
కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.అదే సమయంలో చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.
కురులకు సహజ తేమ అందుతుంది.హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది.