ముడతలు పడి మెడ అసహ్యంగా కనిపిస్తుందా? అయితే ఈ ఆయిల్ మీకే!
TeluguStop.com
సాధారణంగా కొందరికి మెడ వద్ద చర్మం సాగి ముడతలు ఏర్పడుతుంటాయి.వయసు పైబడటం, ఒత్తిడి, మెడకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, జెనటిక్ సమస్యలు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఎండల ప్రభావం వంటి రకరకాల కారణాల వల్ల చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
అందువల్లే ముడతలు వస్తాయి.ఈ ముడతల వల్ల మెడ అసహ్యంగా కనిపిస్తుంటుంది.
దాంతో మెడపై ఏర్పడ్డ ముడతలను వదలించుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తుంటారు.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.
? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్‌ను వాడితే సులభంగా ముడతలను పోగొట్టుకుని మెడను అందంగా మార్చుకోవచ్చు.
మరి లేటెందుకు ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ కప్ ఆఫ్ ఆలివ్ ఆయిల్, హాఫ్ కప్ ఆఫ్ కొకనట్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి.
రెండు ఆయిల్స్‌ను మిక్స్ చేశాక.అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని డబుల్ బాయిలర్ మెథడ్‌లో ఐదు నుంచి పది నిమిషాల పాటు హీట్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.
"""/"/ పూర్తిగా కూల్ అయిన వెంటనే పల్చటి వస్త్రం సాయంతో ఆయిల్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఆయిల్‌లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్‌ను కూడా యాడ్ చేసుకుని.
ఒక బాటిల్‌లో నింపుకోవాలి.ఇక ఈ ఆయిల్‌ను మెడకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
ప్రతి రోజు స్నానం చేయడానికి రెండు గంటల ముందు ఇలా చేస్తే మెడ వద్ద సాగిన చర్మం టైట్ గా మారి ముడతలు క్రమంగా మాయం అవుతాయి.
నాగచైతన్య శోభిత పెళ్లి పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు.. అంతా వాళ్ళ ఇష్టమే అంటూ?