చుండ్రుతో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకే!

స్త్రీల‌నే కాదు పురుషుల‌నూ తీవ్రంగా స‌త‌మ‌తం చేసే జుట్టు స‌మ‌స్యల్లో చుండ్రు ఒక‌టి.

కాలుష్యం, హెయిర్ వాష్ స‌మ‌యంలో చేసే పొర‌పాట్లు, త‌డి జుట్టును జ‌డ వేసుకోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, నెల‌కొక‌సారి హెడ్ బాత్ చేయ‌డం, త‌ల‌లో మృత క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

దాంతో ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌డం కోసం షాంపూలు మారుస్తూ ఉంటారు.అయినా ఫ‌లితం లేకుంటే త‌ర‌చూ ఏవేవో హెయిర్ ప్యాకుల‌ను వేసుకుంటారు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ ఆయిల్‌ను వాడితే గ‌నుక చుండ్రును చాలా అంటే చాలా సుల‌భంగా వ‌దిలించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఆయిల్ ఏంటో.ఎలా త‌యారు చేసుకోవాలో.

తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.

ఒక గ్లాస్ కొబ్బ‌రి నూనెను వేయాలి.నూనె కాస్త హీట్ అవ్వ‌గానే అందులో నాలుగు ల‌వంగాలు, నాలుగు మిరియాలు, వ‌న్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేయించాలి.

ఇవి వేగిన వెంట‌నే గుప్పెడు క‌రివేపాకు, క‌ప్పు మందారం పువ్వు రేక‌లు వేసి బాగా ఉడికించాలి.

"""/"/ నూనె స‌గం అయ్యే వ‌రకు మ‌రిగించి.అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఆపై మ‌రిగించిన నూనెను స్ట్రైన‌ర్ సాయంతో ఫిల్ట‌ర్ చేసుకుని చ‌ల్లార‌బెట్టుకోవాలి.ఒక బాటిల్‌లో ఈ నూనెను నింపుకుంటే.

నెల రోజుల పాటు వాడుకోవ‌చ్చు.ఇక దీనిని ఎలా యూజ్ చేయాలంటే.

జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ఈ నూనెను అప్లై చేసి ప‌దిహేను నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

నైట్ నిద్ర‌పోయే ముందు ఇలా చేసి.ఉద‌యాన్నే మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

ఇలా నాలుగు రోజుల‌కు ఒక‌సారి ఇలా చేస్తే గ‌నుక చుండ్రు స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

నిత్యం నైట్ ఈ మ్యాజికల్ ఆయిల్ ను రాసుకుంటే వద్దన్నా మీ స్కిన్ సూపర్ వైట్ గా మారుతుంది!