ఈ నూనెను వాడితే మోకాళ్ళ నొప్పులు అస్సల ఉండవు.. తెలుసా?
TeluguStop.com
ఇటీవల రోజుల్లో వయసు పైబడిన వారే కాదు.తక్కువ వయసున్న వారు సైతం మోకాళ్ళ నొప్పులతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.
శారీరక శ్రమ లేక పోవడం, అధిక బరువు, పోషకాల కొరత, ఏవైనా దెబ్బలు తగలడం, ఎముకల బలహీనత వంటి రకరకాల కారణాల వల్ల మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.
అయితే కారణం ఏదైనా ఇప్పుడు చెప్పబోయే నూనెను వాడితే గనుక చాలా అంటే చాలా సులభంగా మోకాళ్ళ నొప్పులను నివారించుకోవచ్చు.
మరి మోకాళ్ళ నొప్పులను నివారించే ఆ నూనె ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.
? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక మీడియం సైజ్ అల్లం ముక్కను తీసుకుని పీల్‌ను తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.
ఇప్పుడు కడిగిన అల్లం ముక్కను సన్నగా తురుముకోవాలి.అలాగే ఒక స్పూన్ మిరియాలను తీసుకుని కచ్చా పచ్చాగా దంపుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.అందులో ఒక కప్పు నువ్వుల నూనెను పోయాలి.
"""/"/
నూనె కాస్త హీట్ అవ్వగానే.అందులో అల్లం తురుము, దంచి పెట్టుకున్న మిరియాలు వేసి చిన్న మంటపై గరిటెతో తిప్పుకుంటూ పది నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు ఈ నూనెను చల్లార బెట్టుకుని ఫిల్టర్ చేసుకోవాలి.ఆపై ఈ నూనెను ఒక సీసాలో సింపుకుని భద్రపరుచుకోవాలి.
ఈ నూనెను రాత్రి నిద్రించే ముందు మోకాళ్ళపై అప్లై చేసి.ఐదు నుంచి పది నిమిషాలు మర్ధనా చేసుకోవాలి.
అనంతరం పడుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక మోకాళ్ళ నొప్పులే ఉండవు.
ఇక ఈ నూనెను నడుము నొప్పికి సైతం ఉపయోగించవచ్చు.నడుముపై ఈ నూనెను అప్లై చేసుకుని.
స్మూత్‌గా రబ్ చేసుకుంటే క్షణాల్లో నొప్పి మాయం అవుతుంది.
ఇండియాలో మన డైరెక్టర్లను మించిన డైరెక్టర్స్ లేరా..?