నీరసంతో నో వర్రీ.. ఈజీగా వదిలించుకోండిలా!

నీరసం.( Fatigue ) దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.

ఒంట్లో శక్తి మొత్తం ఆవిరైనప్పుడు నీరసం తన్నుకొస్తుంది.బాడీ మొత్తం వీక్ గా మారిపోతుంది.

ఏ పని చేయలేకపోతుంటారు.మంచానికే ప‌రిమితం అవుతుంటారు.

మీరు కూడా నీరసం తో బాధపడుతున్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.

సులభంగా మరియు వేగంగా నీరసాన్ని ఎలా వదిలించుకోవచ్చు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ప‌ది బాదం గింజలు,( Almonds ) ప‌ది జీడిపప్పులు,( Cashew ) ప‌ది ఎండు ద్రాక్ష, పది పిస్తా గింజలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, చిటికెడు కుంకుమ పువ్వు మరియు ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న పదార్థాలు అన్నిటినీ వేసుకోవాలి.అలాగే ఒక అరటి పండు మరియు అర గ్లాసు పాలు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే ఎనర్జీ బూస్టర్ జ్యూస్ రెడీ అవుతుంది.

"""/" / ఈ న‌ట్స్ జ్యూస్( Nuts Juice ) టేస్టీగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ నట్స్ జ్యూస్ ను కనుక తీసుకుంటే శరీరానికి బోలెడంత ఎనర్జీ లభిస్తుంది.

ఎలాంటి నీరసం అయినా ఎగిరిపోతుంది.శక్తివంతంగా మారతారు.

అలాగే ఈ నట్స్ జ్యూస్ దృఢమైన ఎముకలు కండరాల నిర్మాణానికి మద్దతు ఇస్తుంది.

అతి ఆకలిని దూరం చేస్తుంది.ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంచి చిరుతిండ్లపై మనసు మళ్లకుండా చేస్తుంది.

ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.ఈ నట్స్ జ్యూస్ మీ మెదడును షార్ప్ గా మారుస్తుంది.

జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తిని పెంచుతుంది.అంతేకాకుండా ఈ న‌ట్స్ జ్యూస్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తపోటును నిర్వహించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో అద్భ‌తంగా సహాయపడతాయి.

వరుణ్ తేజ్, సూర్యలకు భారీ షాకులు.. కథల ఎంపికలో తప్పులు చేస్తే ఫ్లాప్ తప్పదా?