వర్షాకాలం రాగానే జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.. అయితే ఈ న్యాచురల్ టానిక్ ను తప్పక వాడండి!

వర్షాకాలం రానే వచ్చింది.ఈ సీజన్ లో కొందరు అధిక హెయిర్ ఫాల్ తో చాలా ఇబ్బంది పడుతుంటారు.

‌తరచూ వర్షాల్లో తడవడం, వాతావరణం లో వచ్చే పలు మార్పులు ‌ఇందుకు ప్రధాన కారణం.

అయితే జుట్టు ఊడిపోతుంది కదా అని పనులన్నీ ఆపుకుని ఇంట్లోనే కూర్చోవడం కుదరదు.

కాబట్టి అటు బయటికెళ్ళి పనులను చక్కబెట్టుకోవాలి.అలాగే ఇటు జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించాలి.

"""/" / అయితే ప్రస్తుత ఈ వర్షాకాలంలో ‌హెయిర్ ఫాల్ ను అరికట్టడానికి ఒక పవర్ ఫుల్ టానిక్ ఉంది.

ఆ టానిక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్‌ అయ్యాక ఒక కప్పు ఉల్లి తొక్కలు( Onions Peel ) మరియు ఒక కప్పు వేపాకు వేసుకోవాలి.

అలాగే ఐదు లవంగాలు, అంగుళం దాల్చిన చెక్కను కూడా వేసి దాదాపు పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

"""/" / ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె( Mustard Oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మన న్యాచురల్ హెయిర్ టానిక్ అనేది సిద్ధమవుతుంది.

ఈ టానిక్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకుని స్కాల్ప్‌ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ న్యాచురల్ టానిక్ ను కనుక వాడితే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.

జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలో మరియు కొత్త జుట్టు పెరుగుదలలో ఈ టానిక్ చాలా బాగా సహాయపడుతుంది.

ఈ టానిక్ ను వాడితే జుట్టు రాలడం ద‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది.అలాగే ఈ టానిక్ చుండ్రు సమస్యను సైతం దూరం చేస్తుంది.

కాబట్టి హెయిర్ ఫాల్ తో సతమతం అవుతున్నవారు ఇంట్లోనే ఈ హెయిర్ టానిక్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

బిగ్‌బాసుకి ఏమయ్యింది? ఈ ఎంపికలేంట్రా బాబూఅని బోరుమంటున్న ప్రేక్షకులు!