ముఖాన్ని వైట్‌గా, బ్రైట్‌గా మెరిపించే సూప‌ర్ న్యాచుర‌ల్ జెల్ మీకోసం!

ముఖాన్ని వైట్‌గా, బ్రైట్‌గా మెరిపించుకోవాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే మేక‌ప్ ప్రోడెక్ట్స్‌ను యూస్ చేయ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఎప్పుడూ ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

దాంతో ఆయా స‌మ‌స్య‌ల‌ను వ‌దిలించుకోవ‌డం కోసం ముఖానికి ఏవి ప‌డితే అవి రాసేస్తుంటాయి.

ఫ‌లితంగా చ‌ర్మ ఛాయ త‌గ్గిపోవ‌డ‌మే కాదు.ముఖంలో ఉన్న బ్రైట్‌నెస్ కూడా పోతుంది.

ఇలా మీకు జ‌రిగిందా.? అయితే అస్సలు వ‌ర్రీ అవ్వ‌కండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ న్యాచుర‌ల్ జెల్‌ను వాడితే స్కిన్ టోన్ పెర‌గ‌డ‌మే కాదు ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ జెల్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

"""/" / ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో వాట‌ర్‌లో క‌డిగిన ఓ ప‌ది పుదీనా ఆకులు, కొన్ని నిమ్మ తొక్క‌లు, కొన్ని ఆరెంజ్ పండు తొక్క‌లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో నాలుగైదు టేబుల్ స్పూన్ల ప్యూర్ అలోవెర జెల్ వేసి బాగా క‌లిపి ఒక రెండు గంట‌ల పాటు వ‌దిలేయాలి.

"""/" / ఆపై ఈ మిశ్ర‌మం నుంచి స్ట్రైన‌ర్ సాయంతో జెల్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఈ జెల్‌ను బాక్స్‌లో నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

రాత్రి నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేక‌ప్ మొత్తాన్ని పూర్తిగా తొల‌గించి వాట‌ర్‌తో క‌డ‌గాలి.

ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న జెల్‌ను ముఖాన‌కి అప్లై చేసి సున్నితంగా ఓ రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ప‌డుకోవాలి.

ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు గ‌నుక చేస్తే మీ ముఖం వైట్‌గా, బ్రైట్‌గా మెరిసిపోవ‌డం ఖాయం.

అల్లు అర్జున్ కోసం పని చేసిన లాయర్ ఫీజు ఎంతో తెలుసా.. వామ్మో ఇంత తీసుకుంటారా?