కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే మీరీ పాలు తాగాల్సిందే!

వయసు పైబడిన తర్వాత కీళ్ల నొప్పులు వేధించడం సర్వసాధారణం.కానీ ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే కీళ్ల నొప్పులతో సతమతం అవుతున్నారు.

ఇందుకు ప్రధాన కారణం ఎముకల బలహీనత.అందుకే మొదట ఎముకల బలహీనతను నివారించుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే పాలు అద్భుతంగా సహాయపడతాయి.ఈ పాలను డైట్ లో కనుక చేర్చుకుంటే ఎముకల బలహీనత దూరం అవడమే కాదు కీళ్ల నొప్పుల నుంచి కూడా వేగంగా బయటపడొచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పాలు ఏంటో.ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి వాటర్ తో ఒకటి లేదా రెండు సార్లు కడగాలి.

ఆ తర్వాత అందులో గ్లాస్‌ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే మిక్సీ జార్‌ తీసుకుని అందులో నానబెట్టుకున్న నువ్వులను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మాన్ని ఫిల్ట‌ర్ చేసుకుంటే.నువ్వుల పాలు సిద్ధం అవుతాయి.

ఈ పాలు రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఈ పాలలో రెండు టేబుల్ స్పూన్ల ఖర్జూరం పేస్ట్ ను కలిపి తీసుకోవాలి.

ఈ విధంగా నువ్వుల పాలను ప్రతి రోజు తీసుకుంటే బలహీనపడిన ఎముకలు బ‌లంగా మరియు దృఢంగా తయారవుతాయి.

దాంతో కీళ్ల నొప్పుల సమస్య క్రమంగా త‌గ్గు ముఖం పడుతుంది. """/"/ అంతేకాదు, నువ్వుల పాలను తీసుకోవడం వల్ల రక్తహీనత దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.మరియు నువ్వుల పాలను తీసుకోవడం వల్ల మెట‌బాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

దీంతో క్యాలరీలు త్వరగా కరిగి వేగంగా బరువు తగ్గుతారు.

కూటమి పార్టీల్లో క్రాస్ ఓటింగ్ భయం ?