మామిడి తొక్కల‌తో ఇలా చేశారంటే చుండ్రు దెబ్బ‌కు ప‌రార్‌..!

ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్( Summer Season ) లో విరివిగా ల‌భ్య‌మ‌య్యే పండ్ల‌లో మామిడి ముందు వ‌రుస‌లో ఉంటుంది.

ఎక్క‌డ చూసినా మామిడి పండ్లే క‌నివిందు చేస్తుంటాయి.అయితే మామిడి పండ్ల‌ను తినే స‌మ‌యంలో తొక్క‌ను తొల‌గించి డ‌స్ట్ బిన్‌లోని తోసేస్తుంటారు.

కానీ ఇక‌పై మాత్రం అలా చేయ‌కండి.ఎందుకంటే, మామిడి తొక్క‌ల‌తోనూ ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

మామిడి తొక్క‌ల్లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, ఫైబర్‌, ఫైటోకెమికల్స్( Vitamin A, Vitamin C, Vitamin E, Fiber, Phytochemicals ) మ‌రియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

ఇవి చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంపొందించ‌డానికి మ‌రియు జుట్టు సంర‌క్ష‌ణ‌కు తొడ్ప‌డ‌తాయి.ముఖ్యంగా చుండ్రు( Dandruff ) స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారికి మామిడి తొక్క‌లు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి.

మామిడి తొక్క‌ల‌తో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా చేశారంటే చుండ్రు దెబ్బ‌కు ప‌రార్ అవుతుంది.

అందుకోసం ముందుగా ఒక క‌ప్పు మామిడి తొక్క‌ల‌ను ( Mango Peels )వాట‌ర్ లో వేసి ఒక‌సారి వాష్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత మిక్సీ జార్ లో మామిడి తొక్క‌ల‌ను వేసి కొద్దిగా వాట‌ర్ పోసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ ధ‌రించాలి.

40 నిమిషాలు లేదా గంట అనంత‌రం తేలిక‌పాటి షాంపూను ఉప‌యోగించి శుభ్రంగా త‌ల‌స్నానం చేయాలి.

ఈ మ్యాంగో పీల్ మాస్క్ వేసుకున్నారంటే కేవ‌లం ఒక్క వాష్ లోనే చుండ్రు దెబ్బ‌కు ప‌రార్ అవుతుంది.

స్కాల్ప్ లోతుగా శుభ్రం అవుతుంది.డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉంటే తొల‌గిపోతాయి.

అలాగే ఈ ప్యాక్ త‌ల‌కు మంచి కూలింగ్ ఎఫెక్ట్‌ను అందిస్తుంది.జుట్టు కుదుళ్ల‌ను బ‌ల‌ప‌రిచి.

హెయిర్ ఫాల్ ను సైతం రెడ్యూస్ చేస్తుంది.