ఎడారిలో షికారు.. దారి తప్పాడు.. చివరికి ఎలా బయట పడ్డాడంటే ?

ఎడారి ప్రాంతంలో షికారికి వెళ్లి నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.మాములు ప్రదేశాల్లో అయితే జనం తిరుగుతూ ఉంటారు.

ఎవరినైనా సహాయం అడిగితే కాపాడుతారు.కానీ ఎడారి ప్రాంతం అలా కాదు.

అక్కడ కనుచూపు మేరలో ఎవ్వరు ఉండరు.కనీసం తాగడానికి గుక్కెడు నీరు కూడా ఇవ్వడానికి ఎవ్వరు రారు.

అందుకే ఎడారి ప్రాంతంలో చాలా జాగ్రత్తగా ఉండక పోతే కష్టమే.ఎడారిలో తప్పిపోతే పగలు ఎండ, నైట్ చలి చంపేస్తాయి.

అక్కడ నుండి బయట పడితే అదృష్టమనే చెప్పాలి.కానీ ఫ్రెంచ్ కు చెందిన ఒక వ్యక్తి ఎడారిలో తప్పిపోతే పెద్ద సాహసం చేసి మరి బయట పడ్డాడు.

ఏం చేసాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్య పోతారు.అతడు కారులో ఎడారిలో షికారుకు వెళ్లి తప్పిపోయాడు.

అయితే అతడు వెళ్ళేటప్పుడు కారులో వెళ్తే వచ్చేటప్పుడు బైక్ లో వచ్చాడు.అదేంటి బైక్ ఎక్కడిది అని అనుకుంటున్నారా.

అతడికి బైక్ ఎక్కడ దొరకలేదు. """/"/తన కారునే బైక్ లాగా మార్చుకున్నాడు.

ఎమిలీ లెర్ అనే వ్యక్తి తన కారులో ఎడారిలో షికారుకు వెళ్ళాడు.అయితే అతడు తన స్నేహితులు చెప్పిన దారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్లడంతో అక్కడ ఉన్న రాళ్లను తన కారుతో డీ కొట్టాడు.

దాంతో కారు ముందు భాగం మొత్తం డామేజ్ అవ్వడంతో అక్కడే చిక్కుకుపోయారు.అక్కడ జనసంచారం కూడా లేకపోవడంతో ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.

అప్పుడే అతడికి ఒక ఐడియా వచ్చింది. """/"/ తన డామేజ్ అయిన కారు భాగాలను నాలుగు రోజులు కష్టపడి మరి వేరు చేసాడు.

బైక్ తయారు చేయడానికి కావలసిన భాగాలను పక్కకు తీసి వాటితో బైక్ తయారు చేసాడు.

12 రోజులు కష్టపడి ఎట్టకేలకు బైక్ ను తయారు చేసాడు.తన తెలివితో బైక్ ను తయారు చేయడంలో సక్సెస్ అయ్యాడు.

మొత్తానికి అక్కడ నుండి బయట పడి రోడ్డుకు చేరుకున్నాడు.అంత కష్టం లో కూడా తన తెలివితో బయట పడిన అతని ధైర్యానికి అందరు మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు.

క్యాండీ క్రష్ గేమ్ కోసం రూ.30 లక్షల చర్చి నిధులు వాడేసిన పాస్టర్‌..??