భోజనం తర్వాత ఈ మ్యాజికల్ లడ్డూ తింటే అజీర్తి, గ్యాస్ అన్న మాటే అనరు!

సరైన సమయానికి తినకపోవడం, స్పైసీ ఫుడ్స్ ను ఓవర్ గా తీసుకోవడం, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల మనలో చాలా మంది భోజనం తర్వాత గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సమస్యలతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఎప్పుడో ఒకసారి ఇటువంటివి తలెత్తితే పెద్దగా ఇబ్బందేమీ ఉండదు.కానీ కొందరు తరచూ అజీర్తి లేదా గ్యాస్ అంటూ మందులు మింగుతూ ఉంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ లడ్డూ( Magical Laddu ) ఒక వండర్ ఫుల్‌ మెడిసిన్ లా పనిచేస్తుంది.

నిత్యం భోజనం తర్వాత ఈ లడ్డూను కనుక తింటే అజీర్తి, గ్యాస్ అన్న మాటే అనరు.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు( Coriander ) వేసి వేయించుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో నాలుగు టేబుల్ స్పూన్లు సోంపు,( Fennel Seeds ) నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులు,( Sesame ) వన్ టేబుల్ స్పూన్ వాము, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, నాలుగు యాలకులు విడివిడిగా వేయించి పెట్టుకోవాలి.

"""/" / ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పదార్థాలు అన్నింటినీ వేసుకోవాలి.

అలాగే పావు టీ స్పూన్ పింక్ సాల్ట్, ఏడు నుంచి ఎనిమిది గింజ తొలగించిన సాఫ్ట్ డేట్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టీ స్పూన్ అల్లం పొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకోవాలి.

"""/" / రోజు భోజనం చేసిన తరువాత ఈ లడ్డూను ఒకటి చొప్పున తినాలి.

ఈ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన లడ్డూ జీర్ణక్రియను( Digestion ) చురుగ్గా మారుస్తుంది.

తిన్న ఆహారం త్వరగా అరిగేందుకు తోడ్పడుతుంది.గ్యాస్, అజీర్తి, మలబద్ధకం తదితర జీర్ణ సంబంధిత సమస్యలకు సమర్థవంతంగా చెక్ పెడుతుంది.

కాబట్టి ఎవరైతే అజీర్తి, గ్యాస్ అంటూ తరచూ బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన మ్యాజికల్ లడ్డూను తయారు చేసుకుని నిత్యం తీసుకునేందుకు ప్రయత్నించండి.

రష్మికను కూడా అరెస్టు చేసి లోపలేయ్యండి… బన్నీ కేసులో ఊహించని ట్విస్ట్?