మొండి దగ్గును సైతం మడతెట్టేసే మ్యాజికల్ డ్రింక్ ఇది..!
TeluguStop.com
దగ్గు.( Cough ) ఒక్కోసారి పట్టుకుందంటే ఓ పట్టాన అస్సలు వదిలిపెట్టదు.
అందులోనూ ప్రస్తుత చలికాలంలో( Winter ) దగ్గు సమస్య మరింత అధికంగా ఇబ్బంది పెడుతుంటుంది.
చల్లని పొడి గాలి, పర్యావరణ మార్పులు, వైరస్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లు లేదా దుమ్ము, పొగకు గురికావడం వల్ల దగ్గు మొదలవుతుంది.
ఇది చిన్న సమస్యే అయినప్పటికీ ఎంతో అసౌకర్యానికి గురి చేస్తుంది.ముఖ్యంగా రాత్రివేళ దగ్గు కారణంగా నిద్రపట్టక ఎంతగానో ఇబ్బంది పడుతుంటారు.
"""/" /
అయితే మొండి దగ్గును సైతం మడతెట్టేసే మ్యాజికల్ డ్రింక్ ఒకటి ఉంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు లేదా మూడు వాము ఆకులను( Ajwain Leaves ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వాము ఆకులు, ఐదారు ఫ్రెష్ తులసి ఆకులు,( Tulsi Leaves ) ఒక టీ స్పూన్ అల్లం తురుము, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి మరిగించాలి.
"""/" /
దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగిస్తే మన మ్యాజికల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది.
స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయ్యాక సేవించాలి.
రోజుకు రెండు సార్లు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే ఎలాంటి దగ్గు అయినా సరే పరార్ అవుతుంది.
అలాగే జలుబు సమస్య ఉన్న కూడా దూరమవుతుంది.అంతే కాదండోయ్ ఈ డ్రింక్ లోని క్రియాశీల ఎంజైమ్‌లు కడుపు ఆమ్లాల ప్రవాహాన్ని మెరుగుపరిచి.
అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుండి రిలీఫ్ ను అందించడంలో సహాయపడతాయి.
ఆస్తమాతో బాధపడే వారికి కూడా ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
కుక్క కోసం వెరైటీ సూట్‌కేసు కొన్న ఎన్నారై.. దీని ధర ఎన్ని లక్షలో తెలిస్తే..!