త‌ల‌నొప్పిని క్ష‌ణాల్లో మాయం చేసే మ్యాజిక‌ల్ డ్రింక్‌.. రోజు తాగితే మ‌స్తు బెనిఫిట్స్‌!

తలనొప్పి.ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తుందో అస్స‌లు చెప్ప‌లేము.

స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అందరినీ సర్వసాధారణంగా వేధించే సమస్య తలనొప్పి.

కొందరిలో తలనొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది.కానీ కొందరిని మాత్రం గంటలు తరబడి వేధిస్తుంటుంది.

ఈ క్రమంలోనే తలనొప్పిని వదిలించుకోవడం కోసం చాలా మంది పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.

కానీ పెయిన్ కిల్లర్స్‌ తో పని లేకుండా సహజంగానే తలనొప్పిని నివారించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్‌ అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంతకీ ఆ మ్యాజికల్ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.

? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక లెమన్ గ్రాస్ స్టెమ్ వేసుకోవాలి.

అలాగే అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క, అర క‌ప్పు పుదీనా ఆకులు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గ్లాస్ జార్ ను తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి.

అలాగే అందులో ఒకటిన్నర గ్లాస్‌ కొబ్బరి నీళ్లు ను పోసుకోవాలి.చివరగా మూడు లేదా నాలుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న లెమన్ స్లైసెస్, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి.

ఇప్పుడు మూత పెట్టి బాగా షేక్ చేసుకుని ఓ పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

"""/"/ ఆపై స్టైనర్ సహాయంతో వాటర్‌ను ఫిల్టర్ చేసుకుంటే తలనొప్పిని తరిమికొట్టే మ్యాజికల్ డ్రింక్ సిద్ధం అవుతుంది.

తలనొప్పి వేధిస్తున్న సమయంలో ఈ డ్రింక్ ను సేవించాలి.తద్వారా క్షణాల్లోనే నొప్పి మాయం అవుతుంది.

మెదడు, మనసు ప్రశాంతంగా మారతాయి.ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలు సైతం దూరం అవుతాయి.

అదే స‌మ‌యంలో బాడీ మరియు మైండ్ ఫుల్ యాక్టివ్ గా మారతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025