నిమ్మ తొక్కలు పనికిరావని పారేస్తున్నారా.. ఇలా వాడితే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది..!

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మ పండ్లను విరివిరిగా వాడుతుంటారు.పులిహోర తో సహా ఇతర వంటల్లో నిమ్మ రసాన్ని ఉపయోగిస్తారు.

అయితే నిమ్మ పండ్ల నుండి రసం తీసి తొక్కలు పనికిరావని పారేసే అలవాటు చాలా మందికి ఉంటుంది.

అయితే నిమ్మరసంలోనే కాదు నిమ్మ తొక్కల్లో( Lemon Peel ) కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి.

నిమ్మ తొక్కలు మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి.జట్టు రాలడాన్ని( Hair Fall ) అరికట్టే సామర్థ్యం కూడా నిమ్మ తొక్కలకు ఉంది.

నిమ్మ తొక్కలను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

అందుకోసం ముందుగా రసం తీసిన నిమ్మ పండు తొక్కల‌ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త మరిగిన తర్వాత అందులో ఒక కప్పు నిమ్మ తొక్కలను వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek Seeds ) రెండు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) వేసుకొని పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

"""/" / ఈ వాటర్ మీ జుట్టుకు ఒక టోనర్ లా( Toner ) పనిచేస్తుంది.

గోరువెచ్చ అయిన వెంట‌నే ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.

ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు టోన‌ర్ ను స్ప్రే చేసుకోవాలి.

గంట అయ్యాక మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా చేశారంటే మంచి రిజల్ట్ ను పొందుతారు.

"""/" / నిమ్మ తొక్కలు, మెంతులు, కరివేపాకు లో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తాయి.

జుట్టు రాలడాన్ని అరికడతాయి.హెయిర్ ఫాల్ తో సతమతం అవుతున్న వారికి ఈ హోమ్ మేడ్ టోనర్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

కాబట్టి ఇకపై నిమ్మ తొక్కలను పారేయకుండా పైన చెప్పిన విధంగా ఉపయోగించండి.హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టండి.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో మలయాళం స్టార్ హీరో నటిస్తున్నాడా..?