ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. హోమ్‌వర్క్ అడిగిన టీచర్‌కి ఏం కాంప్లిమెంట్ ఇచ్చాడంటే!

స్కూల్లో చిన్న తరగతి పిల్లలు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు వింటే టీచర్లు కూడా ఫిదా అయిపోతుంటారు.

అమాయకంగా, ముచ్చట గొలిపేలా ఉండే వారి మాటలు సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడూ వైరల్ అవుతుంటాయి.

అయితే తాజాగా ఓ బుడ్డోడు హోమ్‌ వర్క్ అడిగిన టీచర్‌కి ఓ కాంప్లిమెంట్ ఇచ్చి పనిష్మెంట్ నుంచి తప్పించుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ గా మారింది.ఈ వీడియోకి ఇప్పటికే ఒక లక్షకు పైగా వ్యూస్, వేలాది లైకులు వచ్చాయి.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక టీచర్ క్లాస్‌రూమ్‌లో ఉండి వీడియో రికార్డ్ చేస్తుండడం గమనించవచ్చు.

ఆ టీచర్ కెమెరా ముందే స్కూల్ యూనిఫామ్ లో ఓ విద్యార్థి ఉన్నాడు.

ఆ సమయంలో టీచర్ విద్యార్థులందరి వద్ద హోమ్‌ వర్క్ చెక్ చేస్తోంది.అలా ఈ బుడ్డోడి వంతు కూడా వచ్చింది.

ఏది నీ హోంవర్క్ అని అడిగినప్పుడు ఆ స్టూడెంట్ బిత్తిరి మొహం వేసాడు.

ఆ తర్వాత టీచర్ అడిగిన ప్రశ్నలకు పొంతన లేని మాటలు చెప్పాడు.ఆ మాటలకు ఆ లేడీ టీచర్ సంతోషంతో ఉప్పొంగిపోయింది.

ఎందుకంటే ఆ పిల్లోడు ఆమెకు కాంప్లిమెంట్ ఇచ్చాడు."మీరు చీర కట్టుకుని వచ్చినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు మేడం, మీ చీర కూడా చాలా బాగుంది.

ఈ స్కూల్ మొత్తంలో మీరే నా ఫేవరెట్ టీచర్" అని కాంప్లిమెంట్స్‌ ఇచ్చేశాడు.

దాంతో ఆ మహిళా టీచర్ తెగ పొంగిపోయింది.ఆ తర్వాత బాలుడికి థాంక్స్ చెప్పింది.

ఈ క్యూట్ వీడియో ని మీరు కూడా వీక్షించండి.

వైకల్యం ఉన్నా బంగారు పతకం సాధించిన తనీషా… ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!