గుండె జ‌బ్బుల‌కు దూరంగా ఉండాలంటే.. మీ డైట్‌లో దీనిని చేర్చాల్సిందే!

ప్ర‌స్తుత రోజుల్లో గుండె సంబంధిత జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరిగిపోతోంది.

ప్ర‌తి సంవ‌త్స‌రం గుండె పోటు కార‌ణంగా ఎంద‌రో ప్రాణాలు సైతం వీడిస్తున్నారు.అందుకే నిరంతర స్పందనలతో మన ప్రాణాలను నిల‌బెట్టే గుండెను జ‌ర భ‌ద్రంగా కాపాడుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు సూచ‌న‌లు చేస్తుంటారు.

అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పోష‌కాహారం తీసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను డైట్ లో చేర్చుకుంటే గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్‌ను స‌మ‌ర్థ‌వంతంగా త‌గ్గించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ జ్యూస్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక యాపిల్‌, ఒక అవ‌కాడోల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న‌ ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే స‌గం కీర దోసను తీసుకుని పీల్ తొల‌గించి స్లైసెస్‌గా క‌ట్ చేయాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్క‌లు, అవ‌కాడో ముక్క‌లు, కీర స్లైసెస్‌, రెండు టేబుల్ స్పూన్ల తేనె, నాలుగు పుదీనా ఆకులు, ఒక‌టిన్న‌ర గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

త‌ద్వారా యాపిల్‌-అవ‌కాడో-కీర జ్యూస్ సిద్ధం అవుతుంది.వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ జ్యూస్‌ను తీసుకుంటే.

"""/" / అందులో పుష్క‌లంగా ఉండే మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

త‌ద్వారా గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.అలాగే ఇప్పుడు చెప్పిన జ్యూస్ ను డైట్‌లో చేర్చుకుంటే.

డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక రుగ్మతల నుంచి విముక్తి ల‌భిస్తుంది.బ్రెయిన్ షార్ప్‌గా మారుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.వ‌య‌సు పెరిగినా చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

ఇక ఈ జ్యూస్‌ను తీసుకుంటే దంప‌తుల్లో సంతానోత్పత్తి అవ‌కాశాలు రెట్టింపు అవుతాయి, లైంగిక స‌మ‌స్య‌లు ఏమైనా ఉన్నా.

అవి క్ర‌మంగా దూరం అవుతాయి.

అమితాబ్ పాదాలను తాకిన సచిన్ షారుఖ్.. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న వీళ్లు గ్రేట్ అంటూ?