లివర్ డ్యామేజ్ కు దూరంగా ఉండాలంటే తప్పకుండా దీన్ని డైట్ లో చేర్చుకోండి!

లివర్ డ్యామేజ్.ఇటీవల కాలంలో అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ఇది ఒకటి.

ఆల్కహాల్ ను అధికంగా తీసుకోవడం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఊబకాయం, మధుమేహం తదితర కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది.

లివర్ డ్యామేజ్ వల్ల శారీర‌కంగా మ‌రియు ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

అంత వరకు వెళ్లకుండా ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.

ఈ జ్యూస్ లివర్ లో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగిస్తుంది.అదే సమయంలో లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మ‌రి ఇంతకీ లివర్ ఆరోగ్యానికి ఉపయోగపడే ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.

? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గ్రీన్ ఆపిల్ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే రెండు నిమ్మ పండ్లు తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ యాపిల్ ముక్కలు, లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, వాన్‌ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ప‌ది నుంచి ప‌దిహేను పుదీనా ఆకులు, పావు స్పూన్ పసుపు మరియు ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/"/ ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి తాగేడ‌మే.

ఈ గ్రీన్ ఆపిల్ మింట్ జ్యూస్ ను తరచూ తీసుకోవడం వల్ల లివర్ శుభ్రంగా మరియు ఆరోగ్యంగా మారుతుంది.

అలాగే ఈ జ్యూస్ లో ఉండే పలు పోషకాలు లివర్ డ్యామేజ్, లివర్ క్యాన్సర్, ఫ్యాటీ లివర్ తదితర లివర్ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.

కాబట్టి తమ లివర్ ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు తప్పకుండా ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.

వైసీపీకి ఆలీ రాజీనామా.. వెనుక ఎంత పెద్ద కథ నడిచిందా ?