పీరియడ్స్ ను పోస్ట్ పోన్ చేయాలా? అయితే ఈ ఒక్కటీ డైట్ లో చేర్చుకోండి!
TeluguStop.com
పీరియడ్స్ అనేవి మహిళలను ప్రతినెలా పలకరిస్తుంటాయి.పీరియడ్స్ కారణంగా కొందరు మహిళలు తీవ్రమైన నొప్పిని ఫేస్ చేస్తుంటారు.
మూడ్ స్వింగ్స్, కడుపు నొప్పి, వికారం, అలసట, డయేరియా, కాళ్లు లాగడం వంటి వాటి గురించి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే ఒక్కోసారి ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి వంటివి ఉన్నప్పుడు పీరియడ్స్ ను పోస్ట్ పోన్ చేయాలని అనుకుంటారు.
అందుకోసం చాలా మంది మందులు వాడుతుంటారు.అయితే సహజంగా కూడా పీరియడ్స్ ను పోస్ట్ పోన్ చేయవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆ జ్యూస్ ఏంటి.
? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే మూడు ఉసిరికాయలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఒక కప్పు ఆరెంజ్ మరియు ఉసిరి ముక్కలు వేసుకోవాలి.
"""/"/ చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ను మిక్స్ చేసి సేవించాలి.
పీరియడ్స్ డేట్ కు వారం రోజుల ముందు నుంచి ప్రతిరోజు ఈ జ్యూస్ ను తీసుకోవాలి.
క్యారెట్, ఉసిరి, ఆరెంజ్ మరియు లెమన్ లో చలువ చేసే గుణాలు ఉంటాయి.
అందువల్ల ఈ జ్యూస్ ను తీసుకుంటే పీరియడ్స్ పోస్ట్ పోన్ అవుతాయి.అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడంతో పాటు మసాలా, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ ను కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి.
తద్వారా పీరియడ్స్ ను సహజంగానే పోస్ట్ పోన్ చేయవచ్చు.
విదేశీ విద్యార్థుల ఏరివేతే లక్ష్యం .. ఏఐని రంగంలోకి దించిన అమెరికా