రక్తాన్ని శుద్ధి చేసే ఉత్తమ జ్యూస్ ఇది.. వారానికి ఒక్కసారి తీసుకున్న అద్భుత లాభాలు మీ సొంతం!

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని రక్త ప్రసరణ వ్యవస్థ( Blood Circulation ) అనేది ఎంతగానో ప్రభావితం చేస్తుంది.

రక్త ప్రసరణ సరిగ్గా జరిగినప్పుడే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయి.

కానీ అనారోగ్యమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణంగా రక్తంలో మలినాలు పేరుకు పోతాయి.

దీని కారణంగా రక్తప్రసరణ అనేది సక్రమంగా జరగదు.ఫలితంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

రక్తంలో మలినాలు పేరుకుపోవడం వల్ల గుండె, కాలేయం, మెదడు, కిడ్నీలు( Kidneys ) వంటి కీలక అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి.

అందువల్ల రక్తాన్ని శుద్ధి చేసుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ జ్యూస్ ను వారానికి ఒక్కసారి తీసుకున్న చాలు అద్భుత లాభాలు మీ సొంతం అవుతాయి.

"""/"/ మరి ఇంకెందుకు ఆలస్యం రక్తాన్ని శుద్ధి చేసే( Purifying Blood ) ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న కీర దోసకాయ తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ స్లైసెస్ వేసుకోవాలి.

అలాగే ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పాలకూర ఆకులు, మూడు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ), వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, కొన్ని పుదీనా ఆకులు( Mint Leaves ) వేసుకోవాలి.

చివరిగా కొన్ని వాటర్ పోసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన జ్యూస్ అనేది సిద్ధమవుతుంది.

ఈ కీరా పాలక్ జ్యూస్( Cucumber Palak Juice ) లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్‌ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

"""/"/ వారానికి ఒక్కసారి ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తంలో పేరుకుపోయిన మలినాలన్నీ తొలగిపోతాయి.

రక్తం శుద్ధి అవుతుంది.రక్త ప్రసరణ మెరుగ్గా సాగుతుంది.

అలాగే ఈ జ్యూస్ కాలేయం( Liver ) సక్రమంగా పని చేయడానికి సహాయపడుతుంది.

రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

పాలకూరలో ఐరన్ కంటెంట్ అనేది మెండుగా ఉంటుంది.ఇది రక్తహీనతను తరిమి కొడుతుంది.

జుట్టు రాలడాన్ని అరికడుతుంది.మరియు హెల్తీ స్కిన్‌ను ప్రమోట్ చేస్తుంది.

వీడియో: దత్తత తీసుకోమని దీనంగా అడిగిన పిల్లి.. తర్వాతేమైందో చూస్తే..