డైటింగ్ చేయకుండానే బరువు తగ్గాలా? అయితే ఈ జ్యూస్ మీకోసమే!
TeluguStop.com
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అధిక బరువు సమస్యతో తీవ్రంగా బాధ పడుతున్నారు.
ఈ అధిక బరువును ఎంత నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు అంత పెరుగుతుంది.
అందుకే పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.ముఖ్యంగా కఠినమైన డైట్స్‌ను ఫాలో అవుతూ నోరును కట్టేసుకుంటారు.
కానీ, ఎలాంటి డైటింగ్ చేయకుండా కూడా బరువు తగ్గొచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఆ జ్యూస్ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
? మరియు ఏ సమయంలో సేవించాలి.? వంటి విషయాలను ఏ మాత్రం లేట్ చేయకుండా తెలుసుకుందాం పదండీ.
ముందుగా మూడు బాగా పండిన టమాటోలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో టమాటో ముక్కలు, ఒక ఎండుమిర్చి, పది పుదీనా ఆకులు, ఒక గ్లాస్ వాటర్ పోసి బ్లెండ్ చేయాలి.
"""/" /
అనంతరం ఈ జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు మిరియాల పొడి కలిపి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి గంట ముందు సేవించాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే గనుక ఒంట్లో పేరుకు పోయిన కొవ్వు మొత్తం క్రమంగా కరిగిపోతుంది.
అతి ఆకలి సమస్య తగ్గుముఖం పడుతుంది.చిరు తిండ్లపై మనసు మల్లకుండా ఉంటుంది.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.అంతే కాదు, పైన చెప్పిన టమాటో మింట్ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
ఒత్తిడి, ఆందోళన, తలనొప్పి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.బ్లడ్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోయి.
గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది.చర్మం మరింత యవ్వనంగా తయారవుతుంది.
మరియు కంటి చూపు సైతం మెరుగుపడుతుంది.
పవర్ స్టార్ పవన్ బ్లాక్ బస్టర్ సినిమాను నయనతార రిజెక్ట్ చేసిందా.. అసలేమైందంటే?