సుకుమార్‌ ప్రత్యేకత అదే.. అందుకే ఇంటెలిజెంట్ డైరెక్టర్ అయ్యాడు..??  

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్( Sukumar ) పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.

సినిమాల్లోకి రాకముందు కాకినాడలోని ఒక జూనియర్ కాలేజీలో ఏడు సంవత్సరాల పాటు మ్యాథ్స్ లెక్చరర్ గా పనిచేశాడు.

రైటర్ గా మూవీ కెరీర్ ప్రారంభించాడు.దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.

తర్వాత ఒక డిఫరెంట్ స్టోరీతో ఆర్య సినిమా తీసి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

రంగస్థలం, పుష్ప సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.సుకుమార్ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులపై ఒక చెరగని ముద్ర వేస్తాయి.

ఉదాహరణకు ఆర్య.ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి అందులోని క్యారెక్టర్లు, వారి మనస్తత్వాలు చాలా బాగా గుర్తుంటాయి.

డైలాగ్స్ కూడా నెమరు వేసుకోగలం.సీన్లు కూడా గుర్తుండిపోతాయి.

అంత అద్భుతంగా ఆయన సినిమాలను మలచగలడు.ఆర్య 2, రంగస్థలం సినిమాలు కూడా ప్రేక్షకులకు తెగ నచ్చేసాయి.

చిట్టిబాబు క్యారెక్టర్ ను సుకుమార్ బాగా డిజైన్ చేసుకున్నాడు.ఈ సినిమాతో రామ్ చరణ్ స్టార్ డం మరింత పెరిగిపోయింది.

ఈ సినిమా ద్వారా అతడిలోని నటన మొత్తాన్ని సుకుమార్ బయటపెట్టాడు. """/" / ఇక పుష్ప సినిమా( Pushpa Movie )లో అల్లు అర్జున్‌ను పుష్పరాజ్‌ లాగా చూపించాడు.

సుకుమార్ అద్భుతంగా క్రియేట్ చేసిన రోల్‌ వల్ల అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించగలిగాడు.

అంతేకాదు బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ ఫిలిం అవార్డు కూడా అందుకున్నాడు.సుకుమార్ ఈ సంవత్సరం విడుదలయ్యే పుష్ప 2 సినిమాతో రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులకు పోటీగా నిలవబోతున్నారు.

బాలీవుడ్ హీరోలు సుక్కుతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు కానీ మనోడు మాత్రం తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికే మొగ్గు చూపుతున్నాడు.

ఇప్పటికే రామ్ చరణ్ తో కలిసి ఓ మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు.ప్రస్తుతం చరణ్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు( Buchi Babu Sana )తో కలిసి ఒక స్పోర్ట్స్ ఫిలిం చేస్తున్నాడు.

దాని తర్వాత వీరిద్దరి కాంబోలో మూవీ స్టార్ట్ అవుతుంది.సుకుమార్ చాలా ఇంటెలిజెంట్.

ఆయన సినిమా సినిమాకి డిఫరెంట్ జానర్ ఎంచుకుంటూ వెళ్తున్నాడు.ఇప్పటికే రొమాంటిక్ కామెడీ, యాక్షన్ థ్రిల్లర్, పీరియడ్ యాక్షన్ డ్రామా వంటి జానర్లను టచ్ చేశాడు.

రొటీన్ కథలకు భిన్నమైన కథలను ఎంచుకున్నాడు.ఎప్పుడూ కూడా ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు.

వీటి ద్వారా హీరోల స్టార్డమ్‌ మరింత పెంచేశాడు.ఇతర దర్శకులతో పోల్చుకుంటే అతడిలోని ప్రత్యేకత అదే.

"""/" / సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లు గడుస్తున్నా ఆయన పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు.

ఎందుకంటే సుకుమార్ హై క్వాలిటీ ఫిలిమ్స్ పైనే దృష్టి పెడుతున్నాడు.ప్రతి సినిమా పర్ఫెక్ట్ గా రావడానికి కష్టపడుతున్నాడు.

చాలా సెలెక్టివ్ గా ఉంటున్నాడు.కమర్షియల్ సినిమాలు తీసేసి ఎక్కువ హిట్స్ అందుకోవాలనే కోరిక ఈ డైరెక్టర్ కి ఉండదు.

ప్రతి సినిమా ద్వారా కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందిస్తాడు.