ఇలా కదా ఆలోచించాల్సింది.. వీడియో వైరల్
TeluguStop.com
మహీంద్ర గ్రూప్ ఛైర్మన్‌గా, గొప్ప పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర(anandh Mahindra) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.సోషల్ మీడియా వేదికగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
యువతలో ఆనంద్ మహేంద్రకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలకు సంబంధించిన వాటిని పోస్ట్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు.
ఎప్పుడు యువతను ఎన్నో మోటివేషన్ వీడియోలను కూడా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటాడు.
తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోను ఆనంద్ మహేంద్ర మండే మోటివేషన్ అనే పేరుతో ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
ఇకపోతే, ఆనంద్ మహేంద్రా షేర్ చేసిన వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే.మోటార్ తో నడిచే ఒక చిన్న వాహనాన్ని రెండు బెంచీల మధ్య తీసుకొని వెళ్లడం మనం చూడవచ్చు.
ఇందుకోసం రెండు బెంచీల మధ్య బ్రిడ్జి లాంటి నిర్మాణాలను కూడా ఏర్పాటు చేశారు.
అయితే, మధ్యలోకి వెళ్ళగానే ఆ వాహనం ఆగిపోతుంది.వెంటనే దాని చక్రాలలో చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు.
దీంతో ఆవాహనం చాలా ఈజీగా ముందుకు వెళ్ళిపోతుంది.ఇలా సమస్య ఏదైనా ప్రతిసారి ఒక మార్పు చేస్తూ వాహనాన్ని ముందుకు నడిచే విదంగా చేసారు.
చివరికి దారం పై కూడా ఆ బొమ్మ వాహనం నడిచేలాగా మార్పులు చేశారు.
నడిచే మార్గానికి అనుకూలంగా వాహనంలో తదితర మార్పులు చేయడం వల్ల ప్రయాణం చాలా సులువుగా సాధ్యమవుతుందని.
దీనినే మెయిన్ పాయింట్ గా తీసుకొని మోటివేషన్ గా మార్చేశారు ఆనంద్ మహేంద్రా.
"""/" /
ఈ వీడియోకు ఆనంద్ మహేంద్ర(Anand Mahindra) మీలో క్రియేటివిటీ ఉంటే తప్పకుండా సాధించగలరు అనే క్యాప్షన్ ను జత చేశారు.
ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.వావ్ వాట్ ఏ ట్యాలెంట్ అని కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.
మరికొందరైతే వారి ట్యాలెంట్ గురించి కొనియాడుతున్నారు.
విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ పరిస్థితి ఏంటి..?