మీరు చేసిన పూజకి రెట్టింపు ఫలితం దక్కాలంటే ఇలా చేయాల్సిందే!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఇలా చాలా మందికి ఈ అలవాటు ఉండటం వల్ల ప్రతి రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటారు.

అదే విధంగా వారంలో వారి కులదైవానీకి ప్రత్యేకంగా పూజలు చేయడం కోసం దేవుడి గది శుభ్రం చేస్తూ కొందరు కలశం ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా పూజలు చేస్తారు.

ఇలా పూజలు చేస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు.అయితే మనం చేసే పూజ రెట్టింపు ఫలితాన్ని పొందాలంటే తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాల్సిందే.

మనం ఏ రోజైతే కలశం ఏర్పాటు చేసుకుంటామో అంతకు ముందు రోజే పూజగదిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.

అలాగే పూజకు సరిపోయే పువ్వులు అక్షింతలను కూడా ఏర్పాటు చేసుకోవాలి.దేవుడి గదిలో దేవుడు ఫోటోలు శుభ్రం చేసి బొట్టు పెట్టడం ఆనవాయితీ అయితే శివుడికి విభూది శ్రీహరికి గంధంతో బొట్లు పెట్టడం మంచిది.

చాలామంది ఒత్తులు వేసిన తర్వాత నూనె పోయడం అలవాటుగా ఉంటుంది.అయితే పొరపాటున కూడా ఇలా చేయకూడదు ముందుగా నూనె పోసిన అనంతరం వత్తులు వేయాలి.

చాలామంది నైవేద్యాన్ని స్టీలు ప్లేట్లలో పెట్టి స్వామివారికి సమర్పిస్తుంటారు.నైవేద్యం ఎప్పుడూ కూడా ఇలా చేయకూడదు నైవేద్యం వెండి గిన్నె లో లేదా తమలపాకులో పెట్టడం శ్రేయస్కరం.

నైవేద్యం పెట్టిన అనంతరం హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత రెండు చుక్కలు హారతి చుట్టూ నీటిని చల్లి అనంతరం ఆ హారతి తీసుకోవడం వల్ల ఎంతో మంచి ఫలితం ఉంటుంది.

ఇలా హారతి తీసుకున్న అనంతరం రెండు నిమిషాల పాటు పక్కకు వెళ్లి అనంతరం స్వామివారి ముందు పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా అందరికీ పంచాలి.

ఈ విధంగా పూజలు చేయటం వల్ల మనం చేసిన పూజకి రెట్టింపు ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్25, గురువారం 2024