Healthy Dinner : రాత్రిపూట భోజనం మానేస్తే జరగబోయేది ఇదే..!

ఈ మధ్య కాలంలో చాలామంది ప్రజలలో అధిక బరువు( Overweight ) ఒక ప్రధానమైన సమస్యగా మారిపోయింది.

అధిక బరువును తగ్గించుకోవడానికి కొంతమంది యువత ప్రతిరోజు ఉదయం, సాయంత్రం జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తున్నారు.

అంతేకాకుండా ఉదయం, సాయంత్రం వాకింగ్ లాంటివి కూడా చేస్తూ ఉన్నారు.మరి కొంతమంది రాత్రిపూట భోజనం మానేస్తే బరువు తగ్గుతామని రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.

అసలు రాత్రిపూట భోజనం మానేస్తే నిజంగా బరువు తగ్గే అవకాశం ఉందా.లేకపోతే రాత్రిపూట భోజనం మానేస్తే దుష్ఫలితాలు ఏమైనా వస్తాయా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి పూట భోజనం మానేయడం అస్సలు మంచిది కాదు.ఒబేసిటీ ఉన్నవారు బరువు తగ్గడం కోసం రాత్రివేళ భోజనం పై నియంత్రణ కలిగి ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

విపరీతంగా బరువు ఉన్న వారిని సహజంగా వైద్యులు రాత్రి పూట అన్నానికి బదులుగా ఉండి చపాతి కానీ, రొట్టె కానీ తినమని చెబుతూ ఉంటారు.

అన్నంలో విపరీతమైన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.కాబట్టి అన్నానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

మొత్తానికి రాత్రిపూట ఏమీ తినకుండా ఉండేవారు శరీరానికి కావలసిన పౌష్టికాహారం తీసుకోకపోతే అది వేరే అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.

"""/" / అందువల్ల రాత్రి పూట భోజనం చేయకుండా బరువు తగ్గాలి అని భావించేవారు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం మంచిది.

రాత్రిపూట భోజనం మానేయడం కంటే సాధ్యమైనంత వరకు సాయంత్రం త్వరగా భోజనం చేయడం మంచిది.

భోజనానికి నిద్రకు మధ్య మూడు గంటల గ్యాప్ ఉంటే మంచిదని చెబుతున్నారు.రాత్రిపూట ఏమీ తినకూడదు అని భావించిన వారు సాయంత్రం వేళలో ఫైబర్( Fiber ) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు.

ఒకపూట భోజనం మానేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు తగ్గి పోషక లోపాలు ఏర్పడే అవకాశం ఉంది.

దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. """/" / కాబట్టి శరీరానికి పోషక లోపాలు ఏర్పడకుండా చూసుకోవాలి.

పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుని ఉప్పు, చక్కెరతో తయారుచేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

సరైన ఆహారం రాత్రిపూట ఏమీ తినకుండా నిద్రపోవడం వల్ల ఎసిడిటీ సమస్య( Acidity Problem ) వచ్చే అవకాశం కూడా ఉంది.

శరీరానికి కావాల్సిన శక్తి లేకపోతే కొత్త సమస్యలు ఎదురవుతాయి.ఈ ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే డైటింగ్ వల్ల వచ్చే కొన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరం చేసుకోవచ్చు.

నేను యువకుడిని కాదు.. కానీ నిజాలే మాట్లాడా : ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో వైఫల్యంపై బైడెన్