ఇదేం విచిత్రం.. ఎవ‌రెస్ట్‌కే నీటి కొర‌త వ‌స్తుంద‌ట‌...

కొల‌మానానికి పెట్టింది పేరు ఎవ‌రెస్ట్ శిఖ‌రం.ఎవ‌రినైనా పొగ‌డాల‌న్నా, కీర్తించాల‌న్నా, అభివ‌ర్ణించాల‌న్నా ఎవ‌రెస్ట్‌తోనే మొద‌ట‌గా పోలుస్తారు.

ఏదైనా ఘ‌న కీర్తి పొందిన‌పుడు.ఎవ‌రెస్ట్ అంత ఎదిగాడ‌ని ఖితాబిస్తుంటారు.

అలాంటి ఎవరెస్ట్ శిఖ‌రం గొప్ప‌త‌నానికే కాదు చ‌ల్ల‌ద‌నానికి కూడా ప్ర‌తీక‌.ఎవరెస్ట్ శిఖరం ఎవరినైనా ఎక్కువగా మిక్కిలిగా వర్ణించాలి అంటే దీన్ని మించిన ఉపమానం వేరొకటి ఉండబోదు ఎవరెస్ట్ అంత ఎత్తు అని చెబుతారు గొప్పతనానికి కూడా ఎవరెస్ట్ మాదిరిగా కీర్తిమంతుడని అంటారు.

ఇక ఎవరెస్ట్ కేవలం ఎత్తుకు మాత్రమే కాదు మంచుతనానికి చల్లదనానికి ప్రతీక.ఎవ‌రెస్ట్ అధిరోహించాల‌నే త‌ప‌న అంద‌రికీ ఉంటుంది.

ముఖ్యంగా విద్యార్థులు, సాహ‌స యత్రికులు ఆరాట‌ప‌డుతుంటారు.జీవితంలో ఒక్క‌సారైనా ఎవ‌రెస్ట్ అంత పేరు గ‌డించాల‌ని క‌ల‌లు కంటుంటారు.

అలాంటి ఆంక్ష నేటికీ మ‌నిషిలో ఎదుగుతూనే ఉంది.కానీ, ప్ర‌కృతిలోజ‌రిగే మార్పులతో పేరుగాంచిన ఎవ‌రెస్ట్‌కే ముప్పువాటిళ్లుతోంది.

చరిత్ర‌కారులు చెప్పిన ప్ర‌కారం ఎవ‌రెస్ట్ పై 22ఏండ్ల‌లో మంచు ఏర్ప‌డింది.అది కాస్త పాతికేళ్ల‌లోనే క‌రిగిపోయింద‌ని నేచ‌ర్ క్లైమేట్ జ‌ర్న‌ల్ పేర్కొంది.

ఇది ప్ర‌కృతి ప్రేమికుల‌నే కాదు, ఎవ‌రెస్ట్ అధిరోహించాల‌నుకునే వారికి, ఎవ‌రెస్ట్‌ను సంప‌ద‌గా భావించే వారిలోనూ విషాదం నింపింద‌నొచ్చు.

ఎవ‌రెస్ట్ వ‌ద్ద ఉన్న టూరిస్ట్ ప్రాంతంలో ఏకంగా 12వేల కిలోల మాన‌వ వ్య‌ర్థాలు ఉన్న‌ట్టు నేచ‌ర్ క్లైమేట్ జ‌ర్న‌ల్ పేర్కొంది.

ఇదిలా ఉంటే మ‌రో విచిత్ర‌మైన సంఘ‌ట‌న గురించి తెలిపింది.భ‌విష్య‌త్‌లో ఎవ‌రెస్ట్ వ‌ద్ద నీటి కొర‌త ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంచాన వేసింది.

ఇంత‌టి ఘ‌న కీర్తి గ‌ల ఎవ‌రెస్ట్ ప‌రిస్థితి గురించి ఆలోచిస్తే విషాద‌మ‌నే చెప్పొచ్చు.

ఇదంతా మాన‌వ త‌ప్పిదం వ‌ల్ల జ‌రుగుతోంద‌ని, ఎవ‌రెస్ట్‌ను కాపాడుకోవాల‌ని ప్ర‌కృతి ప్రేమికులు కోరుతున్నారు.

ఏది ఏమైనా ఎవ‌రెస్ట్ శిఖరం త‌న ఖ్యాతిని కోల్పేయే ప‌రిస్థితి వ‌స్తే .

ఊహిస్తేనే భ‌యం వేయ‌క మాన‌దు.

ఏడో తరగతిలోనే ఏఐ కంపెనీలు.. ఈ విద్యార్థుల సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!