జానీ మాస్టర్ కు అవార్డ్ విషయంలో అసలు ట్విస్ట్ వేరే ఉందా.. అలా చేసి ఉంటే బాగుండేదా?
TeluguStop.com
సౌత్ ఇండియాలోని టాలెంటెడ్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్( Jani Master ) ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా( Choreographer ) వ్యవహరించారు.
జానీ మాస్టర్ డ్యాన్స్ స్టెప్స్ కూడా ఇతర కొరియోగ్రాఫర్లకు భిన్నంగా ఉంటాయి.జానీ మాస్టర్ రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.
అయితే జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డ్( National Award ) ప్రకటించినా తాత్కాలికంగా అవార్డ్ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.
మధ్యంతర బెయిల్ తీసుకున్న జానీ మాస్టర్ కు ఇది భారీ షాకేనని చెప్పాలి.
జానీ మాస్టర్ కు ఇక ఎప్పటికీ నేషనల్ అవార్డ్ రాదని చాలామంది భావిస్తున్నారు.
అయితే జానీ మాస్టర్ పై ఆరోపణలు ప్రూవ్ అయితే మాత్రమే ఈ అవార్డును అందుకోలేరు.
అయితే ముందుగానే అవార్డును ఉపసంహరించుకున్నట్టు వెల్లడించి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
"""/" /
జానీ మాస్టర్ పై నమోదైన కేసు ఆయన కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టివేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
ఈ వివాదానికి సంబంధించి బయట సెటిల్మెంట్ చేసే దిశగా జానీ మాస్టర్ తరపున కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.జానీ మాస్టర్ ఈ కేసు నుంచి బయటపడాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
"""/" /
జానీ మాస్టర్ ఈ కేసు నుంచి బయటపడితే మాత్రం భవిష్యత్తులో అవార్డ్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
జానీ మాస్టర్ ఈ కేసు నుంచి బయటపడినా ఆయనకు మునుపటి స్థాయిలో ఆఫర్లు వచ్చే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు.
జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.జానీ మాస్టర్ వివాదం విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
అశ్విన్ రిటైర్‌మెంట్‌పై భార్య ఎమోషనల్ పోస్ట్