ముఖంపై నల్లటి మచ్చల నివారణకు టాప్ అండ్ బెస్ట్ హోమ్ రెమెడీ ఇదే.. డోంట్ మిస్!!
TeluguStop.com
మృదువైన మెరిసే ముఖంలో అక్కడక్కడ ఏర్పడే నల్లటి మచ్చలు( Dark Spots ) చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.
అందం మొత్తాన్ని దెబ్బతీస్తాయి.అద్దంలో ముఖాన్ని చూసుకున్న ప్రతిసారి ఆ మచ్చలు మనలోని కాన్ఫిడెన్స్ ను తగ్గిస్తాయి.
ఈ క్రమంలోనే మచ్చలేని ముఖ చర్మాన్ని పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.
ముఖంపై నల్లటి మచ్చల నివారణకు ఈ రెమెడీ టాప్ అండ్ బెస్ట్ వన్ గా చెప్పుకోవచ్చు.
మరి లేటెందుకు రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి. """/" /
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ టమాటో జ్యూస్,( Fresh Tomato Juice ) రెండు టేబుల్ స్పూన్లు బంగాళదుంప జ్యూస్,( Potato Juice ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పొడి, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
"""/" /
ఈలోపు చర్మం పూర్తిగా డ్రై అయిపోతుంది.అప్పుడు వాటర్ తో శుభ్రంగా స్కిన్ ను క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని ఫాలో అయితే ముఖంపై నల్లటి మచ్చలు క్రమ క్రమంగా తగ్గుముఖం పడతాయి.
మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.అలాగే ఈ రెమెడీ స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.
ముఖాన్ని అందంగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.చర్మంపై పెరిగిపోయిన మృత కణాలను తొలగిస్తుంది.
మొటిమల సమస్యకు సైతం చెక్ పెట్టే సత్తా ఈ రెమెడీకి ఉంది.కాబట్టి అందంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వండి.
వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!