ఇదేం దొంగ పాము.. ఇంటి గుమ్మా దెగ్గరికి వచ్చి.? (వీడియో)

ప్రస్తుతం వర్షాకాలంలో అనేక పాములు( Snakes ) సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలోకి రావడం మనం తరచూ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము.

ఈ నేపథ్యంలో చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు గురైన సంఘటనలు సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాము.

ఇకపోతే తాజాగా ఓ పాము సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వైరల్ వీడియోలో ఓ పాము ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో తిరుగుతూ అందరూ చూస్తుండగానే ఓ ఇంటి దగ్గర బయట వదిలేసిన చెప్పులు తీసుకొని పాకుతూ వెళ్లిపోవడం సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే. """/" / ఓ 7 - 8 అడుగులు ( 7 - 8 Feet )ఉన్న ఓ పెద్ద పాము వీధిలో నుంచి ఓ ఇంటి వైపు వేగంగా వచ్చింది.

అయితే పాము అలా రావడంతో ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా గట్టిగా అరిచారు.అయితే ఆ పాము మాత్రం ఏ మాత్రం భయపడకుండా ముందుకు వస్తూ ఓ ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది.

అయితే., ఆ పాము ఇంటి గుమ్మం దగ్గర ఉన్న పింక్ కలర్ ఒక చెప్పును పట్టుకొని వెళ్ళిపోయింది.

అయితే., ఆ పాము చెప్పును తన తలతో పట్టుకొని పడగ పైకి పెట్టుకొని చాలా స్పీడ్ తో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

ఈ సందర్భంగా ఆ ఇంట్లోని ప్రజలు సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.

అది కాస్త వైరల్ గా మారింది.అయితే ఆ పాము ఎందుకు ఇలా చేసిందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

"""/" / ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు.

అది చెప్పును దొంగలించి పారిపోయింది అంటూ కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో.

, అసలు పాముకి చెప్పుతో ఏం పని అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.

రూ.90 వేల ఐఫోన్‌ 16 కేవలం రూ.27 వేలకే కొనేసిన ఘనుడు.. ఎలా అంటే?