ర‌క్త‌హీన‌త‌, ఎముక‌ల బ‌ల‌హీన‌త‌ను త‌రిమికొట్టే సూప‌ర్ డ్రింక్ ఇదే!

ర‌క్త‌హీన‌త‌, ఎముక‌ల బ‌ల‌హీన‌త‌.పెద్ద‌ల్లోనే కాదు పిల్ల‌ల్లోనూ స‌ర్వసాధార‌ణంగా క‌నిపించే స‌మ‌స్యలు ఇవి.

వీటిని ఎంత నిర్ల‌క్ష్యం చేస్తే.అంత ప్ర‌మాద‌క‌రంగా మారుతుంటాయి.

అందుకే వీటిని వ‌దిలించుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే ర‌క్త‌హీన‌త‌, ఎముక‌ల బ‌ల‌హీన‌త‌.

రెండిటినీ త‌రిమికొట్టే సూప‌ర్ డ్రింక్ ఒక‌టి ఉంది.మ‌రి ఆ డ్రింక్ ఏంటో.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ప‌ల్లీల‌ను వేసి వాట‌ర్‌తో ఒక‌టికి రెండు సార్లు వాష్ చేయాలి.

ఆ త‌ర్వాత అందులో ఒక గ్లాస్ వాట‌ర్ పోసి నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే ఒక యాపిల్ తీసుకుని వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్క‌లు, నైట్ అంతా నాబెట్టుకున్న ప‌ల్లీలు, వ‌న్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి, ఒక గ్లాస్ కొబ్బ‌రి పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ యాల‌కుల పొడి వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే.

హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ సిద్ధం అయిన‌ట్లే. """/"/ ఈ సూప‌ర్ డ్రింక్‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో తీసుకుంటే.

అందులో ఉండే పోష‌క విలువ‌లు బ‌ల‌హీన‌మైన ఎముక‌ల‌ను బ‌లంగా త‌యారు చేస్తాయి.అలాగే ఈ డ్రింక్ ద్వారా శ‌రీరానికి స‌రిప‌డా ఐర‌న్ అందుతుంది.

దాంతో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ప‌రార్ అవుతుంది.అంతేకాదు, ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో ఈ డ్రింక్‌ను తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా ఉంటారు.

నీర‌సం, అల‌స‌ట వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగిపోయి గుండె ఆరోగ్య‌వంతంగా మారుతుంది.

చ‌ర్మం నిగారింపుగా, కాంతివంతంగా మెరుస్తుంది.మ‌రియు హెయిర్ ఫాల్ స‌మ‌స్య సైతం కంట్రోల్ అవుతుంది.

రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్..!!