ఏపీలో ఇదీ జగన్ పరిస్థితి..

ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతుండటంతో రాష్ట్రంలోని పార్టీలన్నీ ఇప్పటి నుంచి ఎన్నికలకు పావులు కదుపుతున్నాయి.

గత ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లలో అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు కూడా ఆ సంఖ్య తగ్గకుండా గెలవాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు.

సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే దీమాతో ముందుకు సాగుతున్నారు.అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఆయనకు కొంచెం ఇబ్బందులు కలిగించేవిగా కనిపిస్తున్నాయి.

2019లో అధికారం చేపట్టిన జగన్ .ఆ నాటి నుంచే అధికార వికేంద్రీకరణ అంటూ పాలన సాగించారు.

ఏపీకి మూడు రాజధానులు ఉంటే తప్పేంటని అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు.ఆ తర్వాత మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ ప్రకటన చేశారు.

కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖ ఆర్థిక, అమరావతి శాసన రాజధానిగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు.

అయితే శాసన సభలో గెలిచినా.శాసనమండలిలో మాత్రం ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.

ఆ తర్వాత ఆ బిల్లు అసంపూర్తిగా ఉండటం, కొన్ని రోజుల తర్వాత కోర్టులో తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

సరైన సమయంలో బిల్లును మళ్లీ అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని.సవరణలు చేసి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ప్రకటన చేశారు.

"""/"/ ఇక రాష్ట్రంలో మూడేళ్ల కాలంలో నేరాలు, హత్యాచారాలు బాగా పెరిగాయి.మరోవైపు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి.

అటు సంక్షేమ పథకాలు కొంతమందికి అందడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.లా ఆర్డర్ విషయం వచ్చే సరికి గత ప్రభుత్వలకు పడిన మార్కులు సీఎం జగన్‎కు పడటలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక అభివృద్ధి విషయానికి వచ్చే సరికి పూర్తిగా ప్రభుత్వం విఫలమైనట్టు మెజార్టీ భావిస్తున్నారు.

డెవలప్ మెంటే ఉంటే బాగుంటుందని బహింరంగానే ఆ పార్టీ నేతలు కూడా విశ్లేషించుకుంటున్నారు.

మరోవైపు సర్వేలు కొంచెం అనుకూలంగా ఉన్నా.రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధికార పార్టీని భయపెడుతున్నాయి.

ముఖ్యంగా పలుచోట్ల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది.స్థానికంగా ఇసుక, మద్యం మాఫియాకు వైసీపీ నాయకులు అండదండలు సంపూర్ణంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పట్టణ, గ్రామ జనాభా ప్రధానంగా అభివృద్ధిని కోరుకుంటున్నారు.గ్రామాల్లో ఇప్పటికీ మౌలిక వసతులు సరిగా లేకపోవడం పార్టీకి కొంచెం మైనస్‎గా మారే అవకాశం ఉంది.

ప్రభాస్ ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న నాగ్ అశ్విన్..అంతగా నచ్చిందా?