ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోంది, రోజు రోజుకు లెక్కకి మించిన కేసులు నమోదవడంతో ఆయా దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికా వంటి అగ్ర రాజ్యంలో కేసుల సంఖ్య కూడా అగ్ర స్థానంలోనే ఉంది.
ఇక దాదాపు అన్ని దేశాలు తమ దేశంలోకి వచ్చే వారిపై గతంలో మాదిరిగానే నిభందనలు విధిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
భారత్ కూడా తమ దేశంలోకి వచ్చే విదేశీయులు, ప్రవాసుల విషయంలో అప్రమత్తంగా ఉంటోంది.
ఎవరైనా సరే RTPCR పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్ నిభందనలు పాటించాలని సూచించింది.అయితే ఈ నిభంధనలపై ఎన్నారైలు మండిపడుతున్నారు.
ఇవేం నిభందనలు అంటూ తిట్టిపోస్తున్నారు.వివరాలలోకి వెళ్తే.
విదేశాల నుంచీ వచ్చే ఎన్నారైలకు భారత్ లోని అన్ని ఎయిర్పోర్ట్ లలో RTPCR టెస్ట్ లతో పాటు క్వారంటైన్ నిభంధనలను అమలు చేస్తోంది కేంద్రం.
అయితే ఈ నిభంధనలను అమలు చేయడం దారుణమంటూ షార్జా కి చెందిన ఎన్నారై భందు వెల్ఫేర్ ట్రస్ట్ కేరళ ముఖ్యమంత్రికి లేఖను రాసింది.
తాము విదేశాల నుంచీ వస్తున్నాం అంటే అక్కడ అన్ని రకాల పరీక్షలు అయిన తరువాత మాత్రమే తమను విమానంలోకి ఎక్కేందుకు అనుమతులు ఇస్తారు కదా, అక్కడ కూడా కరోనా నిభందనలు పాటిస్తారు కదా, అక్కడ వ్యాక్సిన్ లు వేసుకోబట్టి తమను విమానంలో ఎక్కించారు.
అయినా సరే.ఎన్నారైలు భారత్ వచ్చిన తరువాత క్వారంటైన్ నిభందనలు పాటించాలని చెప్పడం ఎంత వరకూ సమంజసం అంటూ మండి పడ్డారు సదరు సంస్థ సభ్యులు.
మీరు ఏర్పాటు చేసిన ఈ నిభందనలు ప్రవాసులకు ఎంతో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని, RTPCR టెస్ట్ వరకూ ఇబ్బందులు లేవని కానీ 7 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి రావడం సరైన విధానం కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
సెలవులు దొరికిన కొద్ది రోజులు తమ దేశంలో గడపాలని వస్తున్న ప్రవాసుల విషయంలో ప్రభుత్వాలు ఇలాంటి నిభందనలు విధించడం సమంజసం కాదని లేఖలో తెలిపారు.
కేరళలో భారీ ప్రదర్సనలు, మాస్క్ లేకుండా చాలామంది తిరుగుతున్నారని, మరి వారికి ఈ నిభందనలు వర్తించవా మాకే ఈ నిభందనలు ఏమిటి అంటూ మండిపడ్డారు.
క్వారంటైన్ నిభంధనల నుంచీ మినాహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నా భార్య చాలా మొండిది… ఎన్టీఆర్ చేసే ఆ వంటకం చాలా ఇష్టం: రాజీవ్ కనకాల