నిర్జీవంగా ఉన్న చ‌ర్మాన్ని క్ష‌ణాల్లో గ్లోయింగ్‌గా మార్చే రెమెడీ ఇది!

వాతావరణంలో వచ్చే మార్పులు, కాలుష్యం, చర్మ సంరక్షణ లేకపోవడం, మేకప్ తో నిద్రించడం తదితర కారణాల వల్ల ముఖ చర్మం నిర్జీవంగా మారిపోతుంది.అటువంటి చ‌ర్మంతో బయటికి వెళ్లడానికి చాలా మంది అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు.

అందులోనూ అర్జెంటుగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక వారి బాధ వర్ణణాతీతం.అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే చర్మం ఎంత నిర్జీవంగా ఉన్నా క్షణాల్లోనే కాంతివంతంగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.

లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకుని దానికి ఉన్న తొక్కను వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉడికించిన రైస్, కట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ పీల్ ముక్కలు, వ‌న్‌ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, హాఫ్‌ టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల పాలు, నాలుగైదు టేబుల్ స్పూన్ల‌ రోజు వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

< -->ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్ సహాయంతో ప‌ల్ప్‌ను తొలగించాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో వ‌న్ టేబుల్ స్పూన్ చందనం పొడి కలిపి ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు అప్లై చేసుకోవాలి.

ఇర‌వై లేదా ముప్పై నిమిషాల అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే నిర్జీవంగా ఉన్న చర్మం క్షణాల్లో కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.

చర్మంపై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోతాయి.అదే సమయంలో చర్మం పై అధిక జిడ్డు సైతం పోయి ముఖం ఫ్రెష్ గా మారుతుంది.

క్లిక్ పూర్తిగా చదవండి

అవకాశాల కోసం గ్లామర్ వైపు అడుగులు వేస్తున్న రీతూ వర్మ.. వైరల్ ఫొటోస్?

ఒక చిన్న దర్శకుడు… అతి పెద్ద హిట్..మనసుకు హత్తుకునే సినిమా

టిడిపి-జనసేన-బిజెపి మధ్యలో కాంగ్రెస్ : ఏపీ పాలిట్రిక్స్

ఓటిటి రంగంలో ఆహా “అన్ స్టాపబుల్” షోకి పోటీగా మరో టాకీ షో..!!

ఇదేందయ్యా ఇది.. పబ్బుకు పోవడానికి కూతుర్ని అలెక్సాకి అప్పజెప్పిన తండ్రి!!

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సీరియస్ కామెంట్స్..!!