వృద్ధాప్య లక్షణాలను దాచేసి ముఖాన్ని య‌వ్వ‌నంగా మెరిపించే రెమెడీ ఇదే!

వ‌య‌సు పైబ‌డే కొద్ది చ‌ర్మంలో వృద్ధాప్య ల‌క్ష‌ణాలు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించ‌డం స‌ర్వ సాధార‌ణం.

కానీ, కొంద‌రు మాత్రం ఎంత వ‌య‌సొచ్చినా య‌వ్వ‌నంగానే క‌నిపిస్తుంటారు.అలా మీకు క‌నిపించాల‌నుందా.

? అయితే ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే.ఈ రెమెడీ వృద్ధాప్య ల‌క్షణాలను దాచేసి ముఖాన్ని య‌వ్వ‌నంగా మెరిపిస్తుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక అర‌టి పండుకు ఉన్న తొక్క‌ను తీసుకున్ని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో అర‌టి పండు తొక్క‌లు, రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసి ప‌ది నిమిషాల పాటు ఉడికిచుకోవాలి.

ఇలా ఉడికించుకున్న అర‌టి పండు తొక్క‌లు, ఓట్స్‌ను చ‌ల్లార‌బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక వాటిని మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని.

దాని నుంచి స్ట్రైన‌ర్ సాయంతో లూస్ స్ట్ర‌క్చ‌ర్‌లో ఉండే క్రీమ్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ క్రీమ్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ప‌చ్చి పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు, కావాలి అనుకుంటే చేతుల‌కు ప‌ట్టించి.

ఓ అర‌గంట పాటు వ‌దిలేయాలి.ఆపై వాట‌ర్‌తో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ లేదా సీర‌మ్‌ను రాసుకోవాలి.

వారానికి మూడు సార్లు ఇలా చేస్తే చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతి వంతంగా మారుతుంది.

వృద్ధాప్య ఛాయ‌లు ఏమైనా ఉంటే.అవి క్ర‌మంగా మాయం అవుతాయి.

కాబ‌ట్టి, య‌వ్వ‌నంగా మెరిసిపోవాల‌ని కోరుకునేవారు త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

నీ అవ్వ తగ్గేదేలే అంటూ.. ఆస్ట్రేలియాపై నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్