ఈ ఇద్దరు హీరోయిన్స్ స్టార్ హీరోయిన్లుగా ఎదగక పోవడానికి కారణం ఇదే…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్స్ గా( Star Heroines ) ఎదగడమే కాకుండా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటారు.
వేరే భాషల నుంచి వచ్చిన హీరోయిన్స్ కి ఇక్కడ మంచి ఆదరణ అయితే దక్కుతూ ఉంటుంది.
అలాగే కాజల్, తమన్నా , సమంత లాంటి హీరోయిన్లు చాలా సంవత్సరాల పాటు నెంబర్ వన్ పొజిషన్ ను సంపాదించుకొని ఇండస్ట్రీలో అందరూ హీరోలతో సినిమాలను చేసిన ఘనతను కూడా సంపాదించుకున్నారు.
ఇలాంటి క్రమంలోనే ఒక ఇద్దరు హీరోయిన్స్ మాత్రం ఎంత మంచి సినిమాలు చేసిన వాళ్ళు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోతున్నారు.
"""/" /
అందువల్లే వాళ్ళు స్టార్ హీరోయిన్లుగా ఎదగలేకపోయారు అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే ఒకరు నిత్యామీనన్( Nithya Menon ) కాగా, మరొకరు సాయి పల్లవి( Sai Pallavi ) నిజానికి సాయి పల్లవి తో సినిమా చేయడానికి చాలామంది స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నప్పటికీ ఆమె మాత్రం సెలెక్టెడ్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది.
ఎందుకంటే ఆమె ప్రతి పాత్రలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ని పెడుతుంది. """/" /
హగ్గింగ్స్, కిస్సింగ్ లాంటి సీన్స్ లేకపోతేనే ఆమె సినిమా చేయడానికి ఒప్పుకుంటుంది.
అంతే తప్ప ఇష్టం వచ్చిన సీన్స్ చేయడానికి తను ఎప్పుడు సిద్ధంగా లేదు.
అందువల్లే ఆమె చేసిన ప్రతి పాత్రలో ఒక వైవిధ్యం అయితే సంతరించుకుంటుంది.ఇక నిత్యామీనన్ పరిస్థితి కూడా అంతే అందువల్లే ఆమె ఎక్కువగా పెద్ద హీరోలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది తప్ప మెయిన్ హీరోయిన్ గా నటించలేకపోయింది.
ఇక మొత్తానికైతే ఇద్దరు హీరోయిన్లు డిఫరెంట్ వేలో ముందుకు సాగుతూ సక్సెస్ ఫుల్ హీరోయిన్లు గా పేరు సంపాదించుకున్నారు.
ఆ హోటల్‌లో వడలు చూస్తే అమితాబ్ బచ్చన్ ఆగలేరంట.. ఎక్కడంటే..?