రాజమౌళి వేరే వాళ్ళ కథలతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదేనట…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడి గా తన కెరియర్ ను ప్రారంభించిన రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడమే కాకుండా ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

మరి అలాంటి రాజమౌళి ఇప్పుడు ఇండియా లో నెంబర్ వన్ డైరెక్టర్లు కొనసాగుతున్నాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఆయన తీసిన బాహుబలి( Baahubali ) సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా స్టాండర్డ్ ను పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్ళాడు.

"""/" / ఇక అందరూ అప్పటినుంచి ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనేంత రేంజ్ లో మన తెలుగు సినిమా స్థాయిని పెంచాడు.

మరి ఇలాంటి క్రమంలోనే రాజమౌళి ఎప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారి కథలతోనే సినిమాలు చేస్తాడు అంటూ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి.

మరి ఈమధ్య ఆయన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు ఎప్పుడు మీ నాన్న విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) గారి కథలతోనే సినిమాలు చేస్తున్నారు.

బయట వారి కథలతో కూడా సినిమా చేయొచ్చు కదా అని క్వశ్చన్ అడగగా ఆయన దానికి సమాధానం ఇస్తూ బయటి వాళ్ల కథలను కూడా విన్నాను.

"""/" / నాకు తెలిసి దాదాపు 200 కథలను విన్నాను.అయినప్పటికీ అందులో ఏ కథ కూడా నాకు సాటిస్ఫై అనిపించలేదు.

దాంతో ఆయన బయటి వాళ్ల కథలకంటే మా ఫాదర్ కథలే బెటర్ అని నమ్మి ఆయన కథలతోనే సినిమాలు చేస్తున్నానని చెప్పాడు.

ఇంకా మొత్తానికైతే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు( Mahesh Babu ) తో పాన్ వరల్డ్ సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.

రోజుకో తమలపాకును ఈ విధంగా తింటే పొట్ట కొవ్వు దెబ్బకు మాయమవుతుంది!