చిరంజీవి వెంకటేష్ లా మల్టీస్టారర్ మూవీ ఆగిపోవడానికి కారణం ఇదే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మ‌ల్టీస్టార‌ర్ ( Multistarrer )సినిమాల‌కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది.

మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు స‌క్సెస్ రేటు కూడా చాలా ఎక్కువ‌.అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు లాంటి హీరోలు చాలా సినిమాల్లో మల్టీ స్టారర్ హీరోలుగా కనిపించి మంచి విజయాలను అందుకున్నారు.

ఆ కాలంలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు బాగా వ‌చ్చాయి.ఆ త‌ర్వాత వాటి ట్రెండ్ కాస్త త‌గ్గినా.

ఇప్పుడు మ‌ళ్లీ ఊపందుకున్నాయి.ముఖ్యంగా `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` త‌ర్వాత టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్‌ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు ప‌డుతూనే ఉన్నాయి.

ఎఫ్ 2, ఎఫ్ 3, ఆర్ఆర్ఆర్‌, ఆచార్య‌, భీమ్లా నాయ‌క్‌, బంగార్రాజు, వాల్తేరు వీర‌య్య ఇప్ప‌టికే ఎన్నో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు వ‌చ్చాయి.

ఇంకా వ‌స్తూ ఉన్నాయి కూడా.అయితే గ‌తంలో ప‌లువురు హీరోల కాంబోలో ఆగిపోయిన మ‌ల్టీస్టార‌ర్స్ సైతం ఉన్నాయి.

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi, Venkatesh ) కాంబినేష‌న్ లోనూ ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మ‌ల్టీస్టార్ ఆగిపోయింద‌ని మీకు తెలుసా.

? అవును మీరు విన్న‌ది నిజ‌మే. """/" / బాలీవుడ్ లో 1994 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మ‌ల్టీస్టార‌ర్ `అందాజ్ అప్నా అప్నా`( Andaz Apna Apna Movie ).

ఇందులో అమిర్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ హీరోలుగా న‌టించారు.రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ ఇది.

రవీనా టాండన్, కరిష్మా కపూర్, పరేష్ రావల్, శ‌క్తి క‌పూర్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

"""/" / అప్ప‌ట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ గా నిలిచింది.

అమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ త‌మదైన కామెడీతో ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన‌ర్ చేశారు.

అయితే ఇదే చిత్రాన్ని తెలుగులో వెంక‌టేష్‌, చిరంజీవి కాంబోలో రీమేక్ చేయాల‌ని ప్రముఖ డైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ భావించార‌ట‌.

ఇందులో భాగంగానే ఇటు వెంకీ, అటు చిరంజీవి.ఇద్ద‌రినీ సంప్ర‌దించి విష‌యం చెప్పార‌ట‌.

అయితే ఇద్ద‌రు హీరోలు ఈవీవీకి ఒకే చెప్పార‌ట‌.అయితే అప్ప‌టికే చిరంజీవి, వెంక‌టేష్‌కు వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఈ మ‌ల్టీస్టార‌ర్ వాయిదా పడుతూ వచ్చింది.

చివ‌ర‌కు బాగా ఆల‌స్యం అవ్వ‌డంతో.ఈవీవీ సత్య నారాయణ ఈ మ‌ల్టీస్టార‌ర్ ను ప‌క్క‌న పెట్టేశార‌ట‌.

అలా చిరంజీవి, వెంక‌టేష్ కాంబోలో ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మ‌ల్టీస్టారర్ ప‌ట్టాలెక్క‌క‌ముందే అట‌కెక్కింది.

ఇక మీదట విరి కాంబో లో ఏమైనా మల్టీ స్టారర్ సినిమాలు వస్తాయేమో చూడాలి.

తెలంగాణలో ఏం మార్పు వచ్చింది..: సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి ప్రశ్నలు