ముస్లింలు పొడవుగా గడ్డం పెంచడం వెనకాల కారణం ఇదే!

ఎవరి ఆచారం వారిది.అయితే కొందరి ఆచార వ్యవహారాలలో మనకు అనేక డౌట్స్ కలుగుతాయి.

ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా వున్న ముస్లిం సోదరులను గమనిస్తే దాదాపుగా అందరికీ పొడవాటి గడ్డం ఉంటుంది.

అయితే చాలామంది ఇక్కడకి వచ్చిన డౌట్ ఏమంటే వారు అలా ఎందుకు గడ్డం పెంచుకుంటారు? అని.

ముస్లింల పవిత్ర గ్రంధం… ఖురాన్‌ లో మహమ్మద్ ప్రవక్త గడ్డం పెంచారని గాని… పెంచుకోమని చెప్పారని గాని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు.

కాని హదీసులలో గడ్డం పెంచుకోమని ప్రస్తావించారు.మహమ్మద్ ప్రవక్త స్వయంగా గడ్డం పెంచుకున్నారని చెప్తూ… ముస్లింలను గడ్డం పెంచుకుని మీసాన్ని తీసివేయమని చెప్పినట్టుగా ప్రస్తావించారు.

ముస్లిమ్స్ పవిత్ర గ్రంధం అయినటువంటి ఖురాన్ నేరుగా అల్లాహ్‌ తన ప్రవక్తయైన మహమ్మద్ ద్వారా పలికించిన పలుకులు అని ముస్లింలు భావిస్తారు.

హదీసులను మహమ్మద్ ప్రవక్త మాటలు, చర్యలు, మౌన అంగీకారాల రికార్డు అని నమ్ముతారు.

అయితే హదీసులు ముహమ్మద్ మరణం తర్వాత కొన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత బయటకు వచ్చాయి.

ఖురాన్‌ తర్వాత ఇస్లాంలో ఇవి అత్యంత ప్రాధాన్యత కలిగిన మత గ్రంథాలుగా చరిత్ర చెప్తుంది.

"""/"/ ఇక హదీసు అనేది… ఇస్లామీయ సంస్కృతికి వెన్నెముక అని చెప్తారు.అందుకే హదీసుల్లో సుస్పష్టంగా మహమ్మద్ ప్రవక్త గడ్డం పెంచుకున్నారని… ఆ ప్రకారమే గడ్డం పెంచి, మీసం తీసివేయమనీ ఉన్నప్పుడు అది ప్రమాణవాక్యంగానే తీసుకుని ముందుకు వెళ్తున్నారు.

సున్నీ ముస్లింలో నాలుగు ముఖ్యమైన మత శాఖలు ఉంటాయి.అందులో మూడు మతశాఖల్లో మతాధికారులు గడ్డం పెంచుకోవడం, మీసం ట్రిమ్ చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు.

కచ్చితంగా పాటించాలి అనే నియమం లేదు.ఈ విషయంలో మతస్తులకు స్వేచ్చ ఉంటుంది.

ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు