ఇక మరింత జోరుతో ముందుకెళ్లనున్న కాంగ్రెస్..అసలు వ్యూహం ఇదే

తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడుతూ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది.అయితే అంతర్గత పోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ బీజేపీ దూకుడుతో కాస్త వేగాన్ని పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇక సార్వత్రిక ఎన్నికలు వచ్చే రెండేళ్లలో జరగనున్న తరుణంలో ఈ సారి కూడా తమ ఎమ్మెల్యేల స్థానాలను గెలుచుకొకపోతే కాంగ్రెస్ క్యాడర్ మాత్రం నిరాశలో మునిగిపోయే అవకాశం వందకు వంద శాతం ఉంది.

అంతేకాక ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకతను పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

అయితే ప్రస్తుతం రేవంత్ కోమటి రెడ్డి ఐక్యరాగం వినిపిస్తున్న తరుణంలో ఇక మరింత జోరుగా ముందుకెళ్ళే అవకాశం ఉంది.

అయితే ఇందులో అసలు వ్యూహం ఏమిటనే విషయాన్ని పరిశీలిస్తే అయితే బీజేపీ సాధ్యమైనంత మేర ఎక్కువ స్థానాల్లో గెలవాలని ఆకాంక్షిస్తోంది.

అయితే ఈ సమయంలో కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో కూడా బీజేపీ కూడా బలం పెంచుకునేందుకు వ్యూహ రచన చేసే అవకాశం ఉంది.

ఎందుకంటే కాంగ్రెస్ బలంగా లేని చోట కాంగ్రెస్ క్యాడర్ ను బీజేపీ వైపు తిప్పుకునేలా పావులు కదిపే అవకాశం ఉంది.

అందుకే తమ బలమైన నియోజకవర్గాలలో బలం ఏ మాత్రం తగ్గకుండా చాలా వరకు జాగ్రత్త పడుతున్న పరిస్థితి ఉంది.

రేవంత్ రెడ్డి కూడా వచ్చే రెండున్నర సంవత్సరాలలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక కార్యాచరణను చేపట్టే విధంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

"""/"/ కాంగ్రెస్ నేతలందరూ ఒకే వాయిస్ వినిపిస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది.

మరి ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలిస్తున్న కెసీఆర్ మరి రానున్న రోజుల్లో ఎటువంటి వ్యూహంతో ముందుకెళతాడానేది చూడాల్సి ఉంది.

వీరసింహారెడ్డి స్టెప్ రాబిన్ హుడ్ స్టెప్ సేమ్ అంటున్న నెటిజన్లు.. శేఖర్ మాస్టర్ స్పందిస్తారా?