Arjun Reddy : అర్జున్ రెడ్డి సినిమాలో అన్ని ముద్దుల వెనుక ఉన్న అసలు స్టోరీ ఇదే..?

మామూలుగా సినిమాలలో హీరో హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండటం అనేది సహజం.

కొన్ని కొన్ని సార్లు సినిమాలలో అదే ప్లస్ పాయింట్ కూడా అవుతుంది.అందుకే దర్శక నిర్మాతలు ఏ మాత్రం మొహమాటం పడకుండా రొమాంటిక్ సీన్స్ తీయటానికి ముందుకు వస్తారు.

కానీ హీరో హీరోయిన్స్ లో కొంత మంది మాత్రం రొమాంటిక్ సీన్లలో నటించడానికి అంత ఇష్టపడరు.

ఎందుకంటే రొమాన్స్ అనేది రియాల్టీగా చూపించాలి కాబట్టి.అంతేకాకుండా ప్రేక్షకులు కూడా వారిపై విమర్శలు చేస్తుంటారన్న భయంతో కూడా నటించరు.

దీంతో దర్శక నిర్మాతలు మాత్రం తప్పనిసరిగా తమ సినిమాలలో రొమాంటిక్ సీన్స్ ఉండాలి అని ఫిక్స్ అయ్యి ఆ విషయాన్ని ముందుగా హీరో హీరోలకు చెప్పకుండా దాచేస్తారు.

తీరా షూటింగ్ మధ్యలోకి వచ్చాక రొమాంటిక్ సీన్లో చేయాలి అని నటీనటులకు షాక్ ఇస్తారు.

"""/" / ఎందుకంటే ముందు ఆ విషయం చెబితే నటీనటులు ఆ సినిమాకు ఒప్పుకోరు అని.

అందుకే షూటింగ్ మధ్యలోకి వచ్చాక తప్పనిసరిగా ఆ సీన్లలో చేస్తారు అని ప్లాన్ చేస్తూ ఉంటారు.

దీంతో ఇప్పటికి చాలామంది దర్శక నిర్మాతలు రొమాంటిక్ సీన్ల గురించి హీరో హీరోయిన్లు చెప్పకుండా సినిమాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

"""/" / చాలామంది నటీనటులు కూడా తమ నటించిన రొమాంటిక్ సీన్ల వెనుక ఉన్న అసలు విషయాలు బయటపెట్టి దర్శక నిర్మాతల పరువు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు.

అయితే ఇదంతా పక్కన పెడితే.మన తెలుగు సినిమాలలో ఎక్కువగా రొమాంటిక్ సీన్లతో ముందుకు వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి( Arjun Reddy ) అని చెప్పాలి.

ఈ సినిమా అప్పట్లో ఎంతలా విమర్శలు పాలయ్యిందో అంతకంటే ఎక్కువగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

"""/" / అప్పట్లో ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది.ముఖ్యంగా ఇందులో నటించిన హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda )కు మంచి క్రేజ్ కూడా వచ్చింది.

ఇక ఈ సినిమా ఇప్పటికీ కూడా ట్రెండ్ లో ఉందని చెప్పాలి.ఎందుకంటే అందులో ఉన్న బోల్డ్ సీన్స్ అటువంటివి కాబట్టి.

అయితే ఈ సినిమా చాలావరకు హద్దు దాటినట్లు కనిపించింది.ఇక ముద్దుల విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హీరో హీరోయిన్ల మధ్య నడిచే ప్రతి ఒక్క సీన్లో ముద్దు అనేది తప్పనిసరి అయింది.

అలా సినిమా చివరి వరకు ముద్దులతోనే సాగిపోయింది.ఇందులో హీరోయిన్ గా షాలిని పాండే( Shalini Pandey ) నటించగా ఆ సినిమా సమయంలో ఈమె చేసిన కామెంట్లు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.

ఈ సినిమాలో ఇన్ని ముద్దులు ఉంటాయని మీకు ముందే తెలుసా అని ప్రశ్న ఎదురు అవ్వటంతో.

తనకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు లిప్ కిస్ ఉంటుందని.రొమాంటిక్ సీన్స్ ఉంటాయని చెప్పారని షాక్ ఇచ్చింది.

అయితే హీరోతో ఇన్ని పెదవి ముద్దులు చాలా ఉంటాయని చెప్పలేదు.నిజంగా సినిమాకి ముందు ఇలా ఎక్కువ ముద్దులు పెట్టాల్సి ఉంటుందంటే సినిమాకు ఒప్పుకునేదాన్ని కాదేమో అని అన్నది.

కానీ, అర్జున్ రెడ్డి సినిమా ఎప్పటికీ తన కెరీర్‌లో బెస్ట్ మూవీ అని చెప్పింది.

జబర్దస్త్ రష్మీకి భారీ షాకిచ్చిన నెటిజన్లు.. మీ టీఆర్పీ స్టంట్లు ఇకనైనా ఆపాలంటూ?