దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడానికి గల అసలైన కారణం ఇదే..!

పూర్వం దుర్వాస మహర్షి ఒక సారి దేవేంద్రుని అతిథిగా స్వర్గానికి వెళ్తారు.ఆ ఆతిథ్యానికి సంతోషపడి ఒక మహిమాన్వితమైన హారాన్ని దేవేంద్రునికి కానుకగా ఇస్తారు.

కానీ ఇంద్రుడు తిరస్కార భావంతో ఆ హారాన్ని ఏనుగు మెడలో వేస్తాడు.అప్పుడు హారం విలువ తెలియని ఐరావతం హారాన్ని కింద పడేసి కాలితో తొక్కుతుంది.

అది చూసిన దూర్వాసుడు కోపం తో దేవేంద్రుణ్ని శపిస్తాడు.దానితో దేవేంద్రుడు స్వర్గం తో పాటు తన సంపదలను కోల్పోతాడు.

"""/" / అప్పుడు దిక్కు తోచని స్థితిలో విష్ణు మూర్తిని ఆశ్రయిస్తాడు.ఇంద్రుని పరిస్థితిని గమనించిన విష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహా లక్ష్మి స్వరూపంగా పూజించమని చెబుతాడు.

అప్పుడు దేవేంద్రుడు విష్ణుమూర్తి చెప్పినట్లు లక్ష్మీదేవిని పూజిస్తాడు.ఆ పూజతో సంతృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహించడంతో దేవేంద్రుడు తిరిగి స్వర్గాన్ని, పోగొట్టుకున్న సంపదను పొందుతాడు.

అప్పుడే లక్ష్మీదేవి( Goddess Lakshmi )కి కృతజ్ఞతలు తెలుపుతూ తల్లీ నువ్వు కేవలం శ్రీ మహా విష్ణువు( Sri Maha Vishnu ) దగ్గరే ఉండడం న్యాయమా నీ భక్తులను కరుణించవా అని కోరుతాడు.

"""/" / దానికి సమాధానం ఇస్తూ లక్ష్మీదేవి దేవేంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి అభీష్టాలకు అనుగుణంగా అంటే మహర్షులకు మోక్ష లక్ష్మిగా, విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మి గా, నన్ను పూజించే విద్యార్థులకు విద్యా లక్ష్మి గా, ఐశ్వర్యాన్ని కోరే వారికి ధనలక్ష్మి గా సమస్త కోరికలను నెరవేర్చే వరలక్ష్మి దేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని చెప్పింది.

అప్పటి నుంచి దీపావళి రోజున మహా లక్ష్మి నీ పూజించడం అనవాయతిగా వస్తూ ఉంది.

అలాగే లక్ష్మీదేవి ని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు( Scholars ) చెబుతున్నారు.

దీని వల్ల ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా ఉంటారు.

తెలంగాణలో మోగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్‌