రియల్ లైఫ్ స్పైడర్ మేన్ ఇతడే.. 65 అంతస్థుల భవనాన్ని అలవోకగా ఎక్కేసిన వైనం!
TeluguStop.com
మనచుట్టూ కొంతమంది నలుగురు నడిచే దారిలో కాకుండా తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు.
దీనికోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తుంటారు.చివరికి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ, అందరి దృష్టిని ఆకర్షించి, తాము అనుకున్నది సాధిస్తుంటారు.
తాజాగా అమెరికాకు చెందిన ఓ యువకుడు తాను అనుకున్నది అవలీలగా అధిరోహించి అందరినీ షాక్‌కి గురి చేశాడు.
అసలు విషయం లోకి వెళితే, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సేల్స్ ఫోర్స్ కంపెనీకి చెందిన ఓ భారీ టవర్ ఉంది.
ఈ బిల్డింగ్‌ను మొత్తం సుమారు 65 ఫోర్లతో నిర్మించారు సదరు ఓనర్స్.తాజాగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ భారీ టవర్‌ను ఎక్కి ఆశ్చర్యపరిచాడు.
మొదట అతడిని ఎవరు గుర్తించకపోయినప్పటికీ, ఆఫీసు లోపల ఉన్న వారు చూసి కిందికి దిగమని కోరారు.
అయినా అతగాడు వినలేదు.మరింత మొండిగా వ్యవహరించి పైకి ఎక్కాడు.
దీనంతిటినీ అక్కడి ఉద్యోగులు, భవనం వెలుపల ఉన్న ప్రజలు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇక అదే మొండి పట్టుతో అతను చివరికి బిల్లిండి పై అంతస్తు వరకు క్షేమంగా చేరుకున్నాడు.
ఇక అంతా అయిపోయిందనే అనుకున్నాడు అతను.అక్కడే వచ్చింది అసలు చిక్కు.
ఈ ఫీట్ సాధించినందుకు అతన్ని ఎక్కడున్నారు మెచ్చుకున్నారు అనుకుంటే పొరపాటే సుమా.ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా సాహసానికి ఒడిగట్టడాన్ని నేరంగా భావించిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇలాంటివి చేసేటప్పుడు అనుమతులు తప్పనిసరి.పబ్లిక్ కి ఎలాంటి డిస్టబెన్స్ సృష్టించకూడదు.
అలాగే ఇలాంటివి వ్యక్తిగతం చేయడం చాలా తప్పు.పైగా ప్రమాదకరం కూడా.
కేవలం నిపుణుల ఆధీనంలోనే ఇలాంటి పనులు చేయాలని అక్కడి పోలీసులు అతగాడికి క్లాసు తీసుకొని వదిలేసినట్టు సమాచారం.
హరిహర వీరమల్లు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాదించబోతుందా..?