ఇడ్లీ, సాంబార్ ట్రై చేసిన రష్యన్ యువతి.. ఆమె రియాక్షన్ ఇదే..?
TeluguStop.com
రష్యా దేశానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మారియా చుగురోవా ( Influencer Maria Chugurova )ఇండియాలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
రకరకాల ఆహార పదార్థాలను కూడా ట్రై చేస్తూ వాటికి రేటింగ్స్ ఇస్తున్నారు ఆమెన్ ఫుడ్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఈ రష్యన్ భామ ముంబై( Mumbai ) నగరాన్ని చాలా ఇష్టపడుతున్నారు.ఆమె ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ తినడం, ప్రసిద్ధ ప్రదేశాలను చూడడం, స్థానికులతో మాట్లాడడం చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ అనుభవాలన్నీ పంచుకుంటున్నారు.తాజాగా ఆమె ముంబై వీధుల్లో ఇడ్లీ సాంబార్ ( Idli Sambar )తింటున్న వీడియోను పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో ఆమె ఆ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారితో చాలా స్నేహంగా మాట్లాడుతూ కనిపించారు.
ఇంతకుముందు ఆమెకు ఇడ్లీ అంటే ఇష్టం ఉండేది కాదు.కానీ, ముంబైలో ఒక మహిళ చేసిన ఇడ్లీ తిన్న తర్వాత ఆమె అభిప్రాయం మారిపోయింది.
ఆ అమ్మాయి సైకిల్ మీద ఇడ్లీ, వడ అమ్ముకుంటుంది.మారియా రీసెంట్ వీడియోలో ఆమె దగ్గరికి వెళ్లి ఇడ్లీ, వడ కొని తిన్నారు.
ఆ ఇడ్లీ చాలా రుచిగా ఉండటంతో ఆ మహిళను చాలా ప్రశంసించారు. """/" /
మారియా ఇంతకు ముందు ఇడ్లీ ఇడ్లీ చాలా సాదాగా అనిపించేది.
కానీ ఇప్పుడు తాను తిన్న ఇడ్లీ చాలా మృదువుగా, రుచిగా ఉందని చెప్పారు.
ఆమె ఇతరులందరినీ ఆ మహిళ దగ్గర ఇడ్లీ తినమని అన్నారు.మరియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయం గురించి ఒక పోస్ట్ చేశారు.
ఆమె రాసినట్లు, "నేను ఇడ్లీ అంటే ఇష్టపడే దాన్ని కాదు.కానీ, ఇడ్లీ క్వీన్ అని పిలుచుకునే ఒక మహిళను కలిశాను.
ఆమె చేసిన ఇడ్లీ చాలా రుచిగా ఉంది.మీరు కూడా ఒకసారి తీరికగా ఆమె దగ్గర ఇడ్లీ తినండి.
" అని తన పోస్టులో రాసింది. """/" /
"జీవితంలో ఎప్పుడైనా ఏదో ఆశ్చర్యం జరుగుతుంది.
మొదట నేను సరిగా లేని ఇడ్లీ తిన్నాను దానివల్ల మళ్లీ అది ట్రై చేయకూడదు అనుకున్నాను కానీ ఈమె దగ్గర మాత్రం అది తినాలనిపించింది తినగానే నాకు అది బాగా నచ్చేసింది ఇన్ని రోజులు ఈ టేస్టీ ఫుడ్ ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది.
" అని ఆమె చెప్పుకొచ్చింది.మారియా ఈ వీడియోను కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేశారు.
ఇప్పటికే దీనికి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.చాలా మంది ఈ వీడియోను చూసి లైక్ చేశారు.
ఒకరు, "మీరు సాంబార్ కూడా బాగా తాగాలి" అని కామెంట్ చేశారు.మరొకరు, "మీరు దక్షిణ భారతదేశం వెళ్లాలి" అని కామెంట్ చేశారు.