నందమూరి మల్టీస్టారర్ తెరకెక్కే ఛాన్స్ లేదా.. బాలయ్యకు ఈ కాంబో ఇష్టం లేదా?

నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan Ram ) కొన్నేళ్ల క్రితం ఒక సందర్భంలో మాట్లాడుతూ బాలయ్య,( Balayya ) జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) లతో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చారు.

అయితే కళ్యాణ్ రామ్ కోరిక భవిష్యత్తులో సైతం నెరవేరే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

నందమూరి మల్టీస్టారర్ తెరకెక్కే ఛాన్స్ లేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

స్టార్ హీరో బాలయ్యకు ప్రస్తుత పరిస్థితుల్లో తారక్, కళ్యాణ్ రామ్ లతో కలిసి నటించే ఛాన్స్ లేదు.

తారక్, కళ్యాణ్ రామ్ సైతం బాలయ్యతో సంబంధాలు బాగానే ఉన్నాయని చెబుతున్నా బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించిన సందర్భాలు దాదాపుగా లేవనే సంగతి తెలిసిందే.

నందమూరి మల్టీస్టారర్ బాలయ్య, మోక్షజ్ఞ( Mokshagna ) కాంబినేషన్ కే పరిమితమయ్యే ఛాన్స్ అయితే ఉంది.

"""/" / నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ మరికొన్ని గంటల్లో రానుంది.

బాలయ్య బాబీ కాంబో మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ సినిమా టైటిల్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

బాలయ్య బాబీ కాంబో మూవీకి బిజినెస్ ఒకింత భారీ స్థాయిలో జరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

"""/" / బాలయ్య ఈ సినిమా కోసం 34 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ను తీసుకున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య కెరీర్ పరంగా వరుస విజయాలను అందుకుంటుండగా పొలిటికల్ గా కూడా నెక్స్ట్ లెవెల్ విజయాలు దక్కుతున్నాయి.

లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్న బాలయ్య కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పారితోషికాలు సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉన్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబో అయినా సాధ్యమవుతుందేమో చూడాల్సి ఉంది.

మేఘాలలో భయంకరమైన ఆకారాలు.. వీడియో చూస్తే వణుకు పుడుతుంది!