ప్రభాస్ సినిమాల్లోకి హీరోగా రాకపోయి ఉంటే ఆ పని చేసేవారా?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్( Prabhas ) ఒకరు.

హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే బాహుబలి( Bahubali ) తర్వాత మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ కి ఏ ఒక్క సినిమా కూడా సరైన స్థాయిలో సక్సెస్ అందించలేదని చెప్పాలి.

ఇక ప్రభాస్ తన ఆశలన్నీ కూడా సలార్ సినిమా పైన పెట్టుకున్నారు. """/" / కేజిఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం సలార్( Salaar ) ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి ట్రైలర్ భారీ స్థాయిలో ప్రేక్షకులను సందడి చేస్తోంది.

సలార్ సినిమాపై అభిమానులలో కూడా పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి.ఇదిలా ఉండగా వెండితెరపై ప్రభాస్ నటన చూస్తున్న వారెవరైనా సరే ఈయన హీరోగా అద్భుతంగా సెట్ అయ్యారని తనని ఇతర రంగాలలో అసలు ఊహించుకోలేరని చెప్పాలి.

"""/" / ఇలా వెండితెరపై హీరోగా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ప్రభాస్ ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏం చేసేవారన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.

ఈయన కూడా సినిమాలలోకి రాకముందు ఒక బిజినెస్ ప్రారంభించాలని ఆలోచన కూడా చేశారట.

ఒకవేళ సినిమాలలోకి రాకపోయి ఉంటే తప్పకుండా ప్రభాస్ అదే బిజినెస్ లో ముందుకు వెళ్లే వారిని తెలుస్తుంది.

మరి ప్రభాస్ స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ ఏంటి అనే విషయానికి వస్తే ప్రభాస్ కి ఫుడ్ అంటే ఎంతో ఇష్టం అనే సంగతి తెలిసిందే.

అందుకే ఈయన ఫుడ్ సర్వీస్ బిజినెస్ లోకి వెళ్లాలని అనుకున్నారట.ఇలా ఫుడ్ ఇష్టపడే ప్రభాస్ ఏకంగా రెస్టారెంట్స్ (Restaurent) ప్రారంభించాలని భావించారని కానీ తన పెదనాన్న కోరిక మేరకు ఈయన సినిమాలలోకి వచ్చారని తెలుస్తోంది.

అమృతంలో ఆ డైలాగ్స్ వల్ల జైలులో వేస్తామన్నారు.. హర్షవర్ధన్ సంచలన వ్యాఖ్యలు!