ఒక్క దెబ్బకే మెడ నలుపును మాయం చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇదే!
TeluguStop.com
సాధారణంగా చాలా మంది తమ మెడ నల్లగా ఉందని తెగ బాధపడుతుంటారు.ముఖ చర్మం తో పోలిస్తే మెడ రంగు వేరు పాటుగా కనిపిస్తుంటుంది.
మెడ నల్లగా( Dark Neck ) మారడానికి కారణాలు అనేకం.ముఖ్యంగా శరీరంలో అధిక వేడి, ప్రెగ్నెన్సీ, పలు రకాల మందుల వాడకం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఎండల ప్రభావం, హార్మోన్ చేంజ్ తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.
దీని కారణంగా ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు.ఈ క్రమంలోనే మెడ నలుపును వదిలించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.
ఒక్క దెబ్బకే మెడ నలుపును మాయం చేసే పవర్ ఫుల్ రెమెడీ ఒకటి ఉంది.
అదేంటో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు( Red Lentils ), ఒక కప్పు వాటర్ పోసి కనీసం ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
"""/" /
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పును వేసుకోవాలి.
అలాగే రెండు లెమన్ స్లైసెస్( Lemon Slices ), రెండు కీరా దోసకాయ ( Kiera )స్లైసెస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ క్రీమ్ లో వన్ టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి కనీసం ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం అర నిమ్మ చెక్కను తీసుకుని మెడ పై స్మూత్ గా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.
ఈ పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే ఒక్క దెబ్బతో మెడ నలుపు చాలా వరకు మాయం అవుతుంది.
పూర్తిగా మెడ నలుపు మాయం అవ్వాలంటే వారంలో కనీసం మూడు సార్లు అయినా ఈ రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..!