Allu Arjun, Pawan Kalyan : పవన్ సినిమాకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన అల్లు అర్జున్… ఏ పాటకో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) క్రేజ్ ఏంటో మనకు తెలిసిందే.

ఈయన పేరు వింటే చాలు అభిమానులకు పూనకాలు వస్తాయి అంతలా ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ ఈయనకు మాత్రం విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

ఈయన సినిమాలు నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ భారీ కలెక్షన్స్ మాత్రం రాబడతాయి అంతలా పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో క్రేజ్ ఉంది.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

జనసేన పార్టీని ( Janasena Party )స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ ప్రతి ఎన్నికలలోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అయితే ఈయనకు మాత్రం ఇంకా అదృష్టం కలిసి రాలేదని చెప్పాలి.ఇక వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వంతో కూడా కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడంతో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ సక్సెస్ అందుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.

ఇలా ఈయన రాజకీయ జీవితం పక్కన పెట్టి సినీ కెరియర్ విషయానికి వస్తే ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోగా నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో గుడుంబా శంకర్ ( Gudumbaa Shankar ) సినిమా కూడా ఒకటి అని చెప్పాలి.

మీరాజాస్మిన్ ( Meerajasmin ) పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసిందే.

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో చిలకమ్మా ముక్కుకి( Chilakammaa Mukkuki )అనే పాట ఉన్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ పాటకు కొరియోగ్రఫీ చేసినది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun )అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

"""/" / పవన్ కళ్యాణ్ సినిమాలోని ఈ పాటకు అల్లు అర్జున్ కొరియోగ్రఫీ చేశారు అంటూ తాజాగా ఒక వార్త సంచలనంగా మారింది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఈ పాటకు అల్లు అర్జున్ అయితే ఎలా డాన్స్ చేస్తారని అడగగా అల్లు అర్జున్ ఈ పాటకు డాన్స్ చేసి చూపించగా ఇవే స్టెప్స్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా పాటలో చేశారని తెలుస్తోంది.

ఈ పాటకు అల్లు అర్జున్ చాలా సింపుల్ గా కొరియోగ్రఫీ చేసినప్పటికీ ఎంతో మంచి సక్సెస్ అందుకుందనీ చెప్పాలి.

అల్లు అర్జున్ ఏకంగా కొరియోగ్రాఫర్ గా మారిపోయారు అనే వార్త తెలియడంతో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఇక అల్లు అర్జున్ ఎలా డాన్స్ చేస్తారు మనకు తెలిసిందే .

ఎలాంటి మూమెంట్ అయినా చాలా పర్ఫెక్ట్ గా సింగిల్ టేక్ లో కంప్లీట్ చేసే సత్తా అల్లు అర్జున్ కి ఉంది అలా డాన్స్ పరంగా కూడా ఈయన ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా డాన్స్ లో ఎన్నో మెలకువలు తెలిసినటువంటి అల్లు అర్జున్ ఏకంగా పవన్ కళ్యాణ్ పాటకు కొరియోగ్రఫీ చేశారనే వార్త తెలియడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమాకు సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

పుష్ప2 మూవీ వల్ల ట్రాఫిక్ జామ్.. ఇతర రాష్ట్రాల్లో బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా!