ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం ఇదే… ధర తెలిస్తే గతుక్కుమంటారు!
TeluguStop.com
అవును, ఈ విశాలమైన ప్రపంచం ఎన్నో విలాసవంతమైన భవనాలకు నిలయం.ఇక్కడ సామాన్యుడు జీవిత కల ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకోవడం.
కొందరు ఆ కోరిక తీరకుండానే కాలం చేస్తుంటారు.కొంతమంది జీవితాంతం కష్టపడిన డబ్బుతో ఒక ఇల్లు కట్టుకొని దాన్ని వారి వారసులకు ఇచ్చి చచ్చిపోతూ వుంటారు.
ఇది ఒక వెర్షన్ అయితే కొందరు బడాబాబులు ఇబ్బుడిముబ్బడిగా భవంతులు లేపుతూ వుంటారు.
ఈ క్రమంలోనే కోట్ల రూపాయిలను వెచ్చించి మరీ భవంతులు నిర్మిస్తూ వుంటారు. """/" /
ఎవరైనా ఎంతవరకు కట్టగలరు.
కోటి, మహాకాకపోతే రెండు మూడు కోట్లు వెచ్చించి కట్టగలరు.అయితే వేల కోట్ల రూపాయిలు వెచ్చించి నిర్మించిన బిల్డింగ్స్( Buildings ) గురించి ఎపుడైనా విన్నారా? అయితే అలాంటివి వున్నాయనే విషయం ఇక్కడ చాలామందికి తెలియదు.
అయితే ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న ఈ భవంతి విలువ తెలిస్తే మీరు అవాక్కవుతారు.
'ది హోల్మ్(
The Holm )' అని పిలిచే ఈ భవంతి ప్రస్తుత ధర అక్షరాలా రూ.
2,500 కోట్ల రూపాయిలు. """/" /
అందుకే ఈ భవంతి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతిగా రికార్డుల్లోకి ఎక్కింది.
లండన్‌లో 1818లో జార్జియన్ ప్రాపర్టీ డెవలపర్ జేమ్స్ బర్టన్ ( James Burton )అనే వ్యక్తి దీనిని నిర్మించగా ఈనాటికీ చెక్కుచెదరకుండా వుంది దాని నిర్మాణం విలువ ఏమిటో అర్ధం చేసుకోండి.
ముందు బర్టన్ వంశస్థులే ఇందులో నివాసం ఉండగా కొన్ని సంవత్సరాల తరువాత దానిని బర్టన్ కళశాలగా మార్చారు.
ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా 1980లో ప్రైవేటు నివాసంగా మార్చారు.ఇక అప్పటి నుంచి అనేక సార్లు, అనేకమంది దీనిని మార్కెట్‌లో అమ్మకానికి ఉంచారు.
ప్రతిసారి అనుకున్నదాని కంటే ఎక్కువ ధర పలుకుతూనే ఉంది.గత సంవత్సరం సౌదీ రాజకుటుంబ సభ్యుల్లో ఒకరు దీనిని రూ.
1500 కోట్లకు కొనుగోలు చాయగా వారే ఇప్పుడు రూ.2,500 కోట్ల ధరకు అమ్మకానికి ఉంచడం కొసమెరుపు.
సెల్ఫీ పిచ్చితో కూతుర్ని గంగలో వదిలేసిన తల్లి.. చివరకి?