కొరటాల శివకు ఇదే చివరి ఛాన్స్.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైతేనే వాళ్లు ఛాన్స్ ఇస్తారా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ( Koratala Shiva ) ఒకరు కాగా మిర్చి సినిమా నుంచి వరుసగా నాలుగు విజయాలు దక్కడంతో కొరటాల శివ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది.
అయితే ఆచార్య ఫ్లాప్ మాత్రం కొరటాల శివపై తీవ్రస్థాయిలో విమర్శలకు కారణమైంది.అటు చిరంజీవి ఇటు రామ్ చరణ్ ఖాతాలో ఈ సినిమాతో భారీ ఫ్లాప్ చేరింది.
నిర్మాతలకు సైతం భారీ నష్టాలను మిగిల్చిన సినిమా ఏదనే ప్రశ్నకు ఆచార్య సినిమా పేరు జవాబుగా వినిపిస్తుంది.
కొరటాల శివకు ఒక విధంగా దేవర( Devara ) చివరి ఛాన్స్ అని చెప్పవచ్చు.
దేవర సినిమా అంచనాలను అందుకోకపోతే కొరటాల శివకు కొత్త ఆఫర్లు వచ్చినా స్టార్స్ సినిమాలకు పని చేసే అవకాశం దక్కకపోవచ్చు.
మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో సైతం అభిమానులు పూర్తిస్థాయిలో సంతృప్తితో అయితే లేరనే సంగతి తెలిసిందే.
దేవర ట్రైలర్ విడుదలైతే మాత్రమే ఈ పరిస్థితి మారే ఛాన్స్ ఉంటుంది. """/" /
కొరటాల శివ దేవర సినిమా కోసం రెండేళ్ల కంటే ఎక్కువ సమయం కేటాయించారు.
కొరటాల శివ ఈ సినిమా కోసం 25 కోట్ల రూపాయల రేంజ్( 25 Crore Range ) లో పారితోషికం అందుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కొరటాల శివ కష్టానికి తగ్గ ప్రతిఫలం దేవర సినిమాతో దక్కుతుందేమో చూడాల్సి ఉంది.
ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
"""/" /
దేవర సినిమా ట్రైలర్ మరో 48 గంటల్లో విడుదల కానుండగా ట్రైలర్ తో ప్రేక్షకులను మెప్పిస్తే కొరటాల శివ సక్సెస్ అయినట్టేనని చెప్పవచ్చు.
దేవర1 కలెక్షన్ల పరంగా అదరగొట్టాలని ఫ్యాన్స్ ను మెప్పించి రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నటి శ్రీ లీలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరు… ఫోటోలు వైరల్!