చెడు కొలెస్ట్రాల్ ను కర్పూరంలా కరిగించే ఇంటి చిట్కా ఇదే..!

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు అధిక బరువు సమస్య( Overweight Problem )తో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

వాతావరణ మార్పులతో పాటు వివిధ రకాల ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్న వారిలో సైతం అధిక కొలెస్ట్రాల్ ( High Cholesterol )పెరుగుతుంది.

దీంతో పాటు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా అధిక బరువే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దీంతోపాటు చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో రకాల కసరత్తులు చేస్తున్నారు.కానీ ఇంట్లో లభించే ఈ పదార్థంతో సులభంగా అధిక బరువును తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

"""/" / ప్రతిరోజు ఇలా చేస్తే బరువులో మార్పు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఇంతకీ ఆ పదార్థాలు ఏవి.ఆ పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఇంట్లో రోజు వండే కూరల్లో రుచి కోసం రకరకాల పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటారు.

కాస్త ఘాటు రావడానికి మసాలాలు చల్లుతూ ఉంటారు.ఇదే సమయంలో మెంతులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే మెంతులు నేరుగా వేయడం ద్వారా చేదును కలిగిస్తాయి.దీంతో వీటిని పొడి చేసి మసాలాలు వేసే క్రమంలో చల్లుతారు.

దీంతో కర్రీ చాలా రుచిగా ఉంటుంది.మాంసాహార కూరల్లో మెంతులు ( Fenugreek )చల్లుకోవడం ద్వారా రుచి రావడమే కాకుండా జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.

"""/" / మెంతులను నేరుగా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.

మెంతులు నేరుగా నోట్లో వేసుకున్న ఈ ప్రయోజనం ఉంటుంది.అయితే నేరుగా తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని తాగాలి.

అలాగే ఆ మెంతులను కూడా తినాలి.ఇలా కొన్ని రోజులు చేస్తే అధిక బరువు సమస్య త్వరగా దూరమైపోతుంది.

బరువు తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు.అయితే వీటివల్ల ఆరోగ్యం ( Health )పై చెడు ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది.

కానీ ఇలా మెంతులు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉండవచ్చు.

జైలు బయట అదిరిపోయే స్టెప్పులు వేసిన యువకుడు..(వీడియో)