ఇక మొటిమ‌ల‌తో వ‌ర్రీ వ‌ద్దు.. ఈ క్రీమ్ వాడితే రెండు రోజుల్లో ప‌రార్‌!

మొటిమలు.ఈ పేరు వింటేనే యువత తెగ కంగారు పడిపోతుంది.

అందులోనూ అమ్మాయిలైతే ఆగమాగం అయిపోతుంటారు.ఎందుకంటే చంద్రబింబం లాంటి ముఖాన్ని ఒక చిన్న మొటిమ పాడు చేస్తుంది.

అందుకే మొటిమలు వచ్చాయి అంటే వాటిని నివారించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.

అయితే ఇకపై మొటిమలతో వ‌ర్రీ వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ క్రీమ్‌ను వాడితే రెండు రోజుల్లో మొటిమలు పరార్ అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం మొటిమల‌ను తరిమికొట్టే ఆ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు ముక్కలు, అల్లం ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర కప్పు కొబ్బరి పాలు వేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి.

"""/"/ ఆ తర్వాత ఒక బౌల్‌లో వన్ టేబుల్ స్పూన్ షియా బటర్ వేసి డబుల్ బాయిలర్ మెథడ్ లో కరిగించాలి.

ఇలా కరిగించిన షియా బటర్ లో ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న జ్యూస్ ను మూడు టేబుల్ స్పూన్ల చొప్పున వేసి బాగా మిక్స్ చేస్తే మన క్రీమ్ సిద్ధం అయినట్టే.

ఈ క్రీమ్‌ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.మొటిమలు వచ్చినప్పుడు ఈ క్రీమ్ ను రోజుకు రెండు సార్లు అప్లై చేసుకోవాలి.

ఈ హోమ్ మేడ్ క్రీమ్‌ను వాడితే కేవలం రెండు రోజుల్లోనే మొటిమలు తగ్గుముఖం పడతాయి.

మరియు వాటి తాలూకు మచ్చలు సైతం దూరం అవుతాయి.

వారం రోజుల్లో 2 డబుల్ సెంచరీలు.. టీమిండియా సెలక్షన్ కమిటీకి సంకేతాలు ఇస్తున్నాడుగా?